సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి(chandramukhi) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పి.వాసు(P.Vasu) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలోని మణిచిత్రతావు ఆధారంగా తీశారు. చంద్రముఖిలో రజనీకాంత్‌తో పాటు ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు వంటి అగ్రతారాగణం నటించారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి(chandramukhi) సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పి.వాసు(P.Vasu) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మలయాళంలోని మణిచిత్రతావు ఆధారంగా తీశారు. చంద్రముఖిలో రజనీకాంత్‌తో పాటు ప్రభు, జ్యోతిక, నయనతార, వడివేలు వంటి అగ్రతారాగణం నటించారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ రాబోతున్నది. నటుడు, కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ రాఘవ లారెన్స్‌(Raghava Lawrence) ఈ సినిమాలో హీరో.. దీనికి కూడా పి.వాసునే దర్శకత్వం వహిస్తున్నాడు.

అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే ఇందులో టైటిల్‌ పాత్రను బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) పోషించడం. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేటెస్ట్‌గా సినిమా నుంచి స్వాగతాంజలి(Swagathanjali) అనే లిరికల్‌ సాంగ్‌ను(Lyrical song) విడుదల చేసింది చిత్ర బృందం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి(MM Kiravani) దీనికి స్వరాలు సమకూర్చారు. చైతన్యప్రసాద్‌ రాసిన ఈ పాటను శ్రీనిధి పాడారు. ఈ పాటలో రాజనర్తకి చంద్రముఖిలా కంగనా చేసే డ్యాన్స్‌ అలరిస్తుంది. వినాయకచవితి పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. వడివేలు, లక్ష్మీమీనన్‌, మహిమా నంబియార్‌, రాధికా శరత్‌కుమార్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Updated On 12 Aug 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story