మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు మల్టీ టాలెంటెడ్ స్టార్ రాఘవా లారెన్స్(Raghava Lawrence). ఇప్పటికే ఎంతో సమాజ సేవ చేస్తరన్న రాఘవ.. మరొ గొప్ప కార్యంతో అందరి మనసు దోచుకున్నారు.

మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు మల్టీ టాలెంటెడ్ స్టార్ రాఘవా లారెన్స్(Raghava Lawrence). ఇప్పటికే ఎంతో సమాజ సేవ చేస్తరన్న రాఘవ.. మరొ గొప్ప కార్యంతో అందరి మనసు దోచుకున్నారు.

మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నాడు ఫిల్మ్ స్టార్ రాఘవ లారెన్స్ ... కొరియోగ్రాఫర్(Choreographer) గా.. హీరోగా(Hero), దర్శకుడిగా(Director).. నిర్మాతగా(Producer), నటుడిగా(Actor),.. టాలెంట్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా డాన్స్ మాస్టర్ గా.. కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ కొరియో గ్రాఫర్ గా మారాడు రాఘవ. కాలం కలిసొచ్చి తన టాలెంట్ ను ఇండస్ట్రీ గుర్తించి.. మల్టీ టాలెంట్ తో దూసుకుపోతున్నారు రాఘవ లారెన్స్. ఇక అటు సినిమాలు చేస్తూనే.. ఇటు సమాజ సేవ చేస్తూ.. అనాధలను చేరదీస్తూ.. మంచి మనసు చాటుకుంటున్నారు రాఘవ, సొంత ఖర్చుతో వందల మంది పిల్లలను చదివిస్తూ.. వారికి కొత్త జీవితానని ఇస్తున్నాడు.

ఇక తాజాగా ఆయన మరో 150 మంది చిన్నారులను దత్తత(Adopt) తీసుకున్నారు రాఘవ లారెన్స్. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో (Social media lo)షేర్ చేశారు రాఘవ లారెన్స్. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. రాఘవ తాజాగా నటించిన సినిమా రుద్రన్(Rudran). ఈ సినిమా ఆడియో వేడుకలో భాగంగా.. తాను దత్తత తీసుకున్న చిన్నారు తో సెల్ఫీ దిగారు రాఘవ. ఈ పిల్లలని చక్కగా చదివించి.. ప్రయోజకులను చేస్తామన్నారు రాఘవ. అంతే కాదు తనకు అభిమానుల ఆశీస్సులు.. ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పటికీ కావాలి అన్నారు రాఘవ.

ఇక లారెన్స్ గొప్ప మనసుని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ , నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలో అనేక సందర్భాల్లో తన మంచి తనం చాటుకున్నారు రాఘవ. అప్పట్లో 141 మంది పిల్లలకు రకరకాల కేసుల్లో ఆపరేషన్లు చేయించారు రాఘవ లారెన్స్.. తమిళనాడు తోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాలుల్లో చిన్నారులు చాలా మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించారు రాఘవ.అంతే కాదు డబ్బుల కట్టలేక స్కూళ్లకు వెళ్ళలేని పిల్లలను . లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటుందని..వెంటనే ట్రస్ట్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

Updated On 14 April 2023 7:08 AM GMT
Ehatv

Ehatv

Next Story