జస్టిస్‌ హేమా కమిటీ(Justice Hema committee) నివేదిక కేవలం మలయాళ చిత్ర పరిశ్రమనే కాదు, అన్ని సినిమా పరిశ్రమలను కుదిపేస్తున్నది

జస్టిస్‌ హేమా కమిటీ(Justice Hema committee) నివేదిక కేవలం మలయాళ చిత్ర పరిశ్రమనే కాదు, అన్ని సినిమా పరిశ్రమలను కుదిపేస్తున్నది. పొరపాటు పనులు చేసిన వారిని వణికిస్తున్నది. ఇంతకు ముందు తమపై జరిగిన దాడులను చెప్పుకోవడానికి భయపడిన మహిళలు ఇప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి తమ చేదు అనుభవాలను చెబుతున్నారు. తమ ఆవేదనను పంచుకుంటున్నారు. లేటెస్ట్‌గా రాధికా శరత్‌కుమార్‌(Radhika sharat kumar) కూడా ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. ‘నేను నటించిన ఒక మలయాళ చిత్రం షూటింగ్‌ సమయంలో కారవాన్‌లో(Caravan) రహస్య కెమేరాలు(Hidden camera) అమర్చారు. నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించి కొందరు నటులు సెల్‌ఫోన్‌లో చూసి, ఆనందించడం నా కంటపడింది. చాలా కోపం వచ్చింది. నేను కారవాన్‌కు వెళ్లకుండా హోటల్‌కు వెళ్లి దుస్తులు మార్చుకున్నాను. ఆ తర్వాత వాహన ఇన్‌ఛార్జ్‌ను ఇంకోసారి ఇలా జరిగితే జాగ్రత్త అని హెచ్చరించాను. సినిమా రంగంలో సిస్టమ్‌ సరిగ్గా లేదు. నటీమణుల గది తలుపులను తట్టే పరిస్థితి పలు చిత్ర పరిశ్రమల్లో ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి హార్డ్‌వర్క్‌ చేస్తారు. ఎన్నో త్యాగాలు చేస్తారు. మేము అందరం అలా ఎదిగినవాళ్లమే. ఒక మహిళ ఏదైనా ఫిర్యాదు చేసినప్పుడు ఆధారాలు చూపించమంటారు. అంటే జరిగే ఘటనను మేం వీడియో తీయాలా? ఇప్పుడు మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ ఈ విషయంపై కోలీవుడ్‌లో మాట్లాడుతున్న నటులెవరైనా ఉన్నారా? ఉల్లొళుకు సినిమాలో ఊర్వశితో పాటు పార్వతి తిరువోతు కూడా బాగా నటించింది. ఆమెకు ఎందుకు అవార్డు రాలేదని మలయాళ ఇండస్ట్రీలో కొందరిని అడిగాను. వారు చెప్పిన సమాధానం విని షాకయ్యాను. పార్వతి అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది. సమస్యల గురించి మాట్లాడుతుందని, అందుకే అవార్డు రాలేదని అన్నారు. అంత ప్రతిభ ఉన్న నటిని ఇలాగా ట్రీట్‌ చేసేది అని బాధ అనిపించింది' అని రాధిక చెప్పుకొచ్చారు. 2018లో మీ టూలో భాగంగా తమిళ రచయిత వైరముత్తు గురించి చిన్మయి శ్రీపాద చేసిన ఫిర్యాదు గురించి ప్రస్తావించారు రాధిక. 'నేను యూ ట్యూబ్‌లో ఓ వీడియో చూశాను. జర్నలిస్టు కాని ఆ వ్యక్తి నటీమణుల గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. అవకాశాల కోసం అడ్జెస్ట్‌ అవుతారు అని అన్నాడు. నడిగర్‌ సంఘమ్‌ జనరల్‌ సెక్రటరీ విశాల్‌కి ధైర్యం ఉంటే.. వెళ్లి అతన్ని చెప్పుతో కొట్టమనండి. తనతో పాటు నేను కూడా వెళతాను' అని చెప్పారు రాధికా శరత్‌కుమార్‌.

Eha Tv

Eha Tv

Next Story