పుష్ప2 ది రూల్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెగ్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. ఆ ప్రయత్నంలో పుష్ప (Pushpa)పై పోలీసులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోందంటూ’.. వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ వీడియో మొత్తంలో పుష్ప చనిపోయినట్టు.. ఆ తర్వాత పుష్ప బ్యాగ్డ్రాప్ అండ్ పుష్ప చనిపోయాడన్న దానిపై గందరగోళ వాతావరణం ఏర్పడినట్టు మనకు అందులో చూపించారు.

Pushpa The Rule
2021లో పుష్ప: ది రైజ్ (Pushpa:The Rise) సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఓ రికార్డు సృష్టించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అయిన పుష్ప2: ది రూల్ (Pushpa 2:The Rule) నుంచి ఓ కొత్త అప్ డేట్ ఒచ్చేసింది. అల్లు అర్జున్ (Allul Arjun), రష్మిక మందన్న (Rashmika mandanna) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ (Sukumar)దర్శకత్వం వహిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. ‘తిరుపతి జైలు నుంచి బుల్లెగ్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. ఆ ప్రయత్నంలో పుష్ప (Pushpa)పై పోలీసులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడని తెలుస్తోందంటూ’.. వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ వీడియో మొత్తంలో పుష్ప చనిపోయినట్టు.. ఆ తర్వాత పుష్ప బ్యాగ్డ్రాప్ అండ్ పుష్ప చనిపోయాడన్న దానిపై గందరగోళ వాతావరణం ఏర్పడినట్టు మనకు అందులో చూపించారు.
అయితే మూవీ టీమ్ విడుదల చేసిన 3 నిమిషాల 17 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో 2 నిమిషాల 12 సెండ్ల దగ్గర చీకట్లో బండరాళ్ల వెనుక నుంచి ఒక పులి వస్తుండటాన్ని చూపించారు కట్ చేస్తే పులి (Tiger) ఒక్కసారిగా భయపడి వెనక్కి అడుగు వేస్తున్నట్టు చూపించారు. అప్పుడు ఆ చీకట్లో నుంచి ఒక వ్యక్తి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నట్టు చూపించారు. ఆ వ్యక్తి నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి చూసి.. పుష్పరాజ్ మ్యానరిజంలో ‘తగ్గే దే లే’ అనే స్టైల్‌ను చూపించి.. పుష్ప అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు రివీల్ చేయడంతో.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది.
మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil), అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj), సునీల్ (Sunil), జగదీష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
