విలక్షణ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌(Fahad Fazil) పుష్ప(Pushpa) సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన ఆవేశం సినిమా బాక్సాఫీసును షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ది రూలర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు.

విలక్షణ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌(Fahad Fazil) పుష్ప(Pushpa) సినిమాతో తెలుగువారికి కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా రిలీజైన ఆవేశం సినిమా బాక్సాఫీసును షేక్‌ చేస్తోంది. ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ది రూలర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివిటీ డిజార్డర్‌ (ఏడీహెచ్‌డీ)(ADHS) రుగ్మతతో బాధపడుతున్నానని తెలిపాడు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఏడీహెచ్‌డీ కారణంగా దేని మీద ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోతున్నానని, కొన్నిసార్లు అతిగా ప్రవర్తిస్తున్నానని, తొందరగా ఆవేశపడుతున్నానని ఫాజిల్‌ చెప్పారు. ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నారు. కొత్తమంగళంలోని పీస్‌ వ్యాలీ పాఠశాల ప్రారంభోత్సవానికి వెళ్లిన ఫహాద్‌ తన మెంటల్‌ హెల్త్‌ గురించి చెప్పుకొచ్చారు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. అజాగ్రత్త, హైపర్‌ యాక్టివిటీ, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ అంటే ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం వంటి లక్షణాలు ఏడీహెచ్‌డీ సమస్య ఉన్న వారిలో ప్రధానంగా కనిపిస్తాయి. తమకు ఏడీహెచ్‌డీ ఉన్నట్లు ఇంతకు ముందు చాలా మంది నటీనటులు చెప్పారు.

Updated On 28 May 2024 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story