బాహుబలి 2, KGF 2, RRR సహా భారతదేశంలో ఏ సినిమా కూడా 1000 కోట్ల
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. టీజర్ ఒక విధంగా అభిమానులను నిరుత్సాహపరిచింది కానీ బయ్యర్లను కాదని అంటున్నారు. ఆ చిన్న బిట్ లోనే పుష్ప అంత అరాచకం చేస్తే ఇక సినిమా మొత్తంలో ఎలాంటి అద్భుతాలు చేసుంటాడోనని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ట్రేడ్ వర్గాల టాక్ ప్రకారం.. పుష్ప 2: ది రూల్ ఇప్పుడు అధికారికంగా భారతదేశంలో 1000 కోట్ల ప్రీ-బిజినెస్ చేయగలిగే సినిమా అని అంటున్నారు.
బాహుబలి 2, KGF 2, RRR సహా భారతదేశంలో ఏ సినిమా కూడా 1000 కోట్ల ప్రీ-బిజినెస్ చేయలేదు. వాటన్నిటినీ బిజినెస్ లో పుష్ప-2 దాటడం ఖాయమనే చెబుతున్నారు. హిందీ భాషలోనే 200 కోట్ల బిజినెస్ చేస్తోంది పుష్ప 2. సౌత్ ఇండియా బిజినెస్ దాదాపు 270 కోట్ల వరకు ఉండవచ్చు. ఓవర్సీస్లో కూడా సినిమా మీద చాలా అంచనాలే ఉన్నాయి. దీంతో సినిమా 100 కోట్లకు పైగా వసూలు చేయడం పక్కా అని అంటున్నారు. ఈ సినిమా మొత్తం థియేట్రికల్ బిజినెస్ 550 కోట్లకు పైగా ఉంటుంది. దాదాపు 275 కోట్ల సంచలన ధరకు పుష్ప 2 స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రేసులో ఉంది. ఇక ఆడియో, శాటిలైట్ బిజినెస్ భారీగా జరగనుంది. విడుదలకు ముందే ఈ సినిమా భారీ బిజినెస్ ను చేస్తూ ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.