ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు(Allu Arjun) టైమ్ బాగోలేదు. బాగుండి ఉంటే పుష్ఫ -2(Pushpa-2) అనుకున్న టైమ్‌కే రిలీజ్ అయ్యేది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు(Allu Arjun) టైమ్ బాగోలేదు. బాగుండి ఉంటే పుష్ఫ -2(Pushpa-2) అనుకున్న టైమ్‌కే రిలీజ్ అయ్యేది. ఆగస్టు 15వ తేదీన విడుదల చేద్దామనుకున్న ఆ సినిమా విడుదల(Release) పోస్ట్‌పోన్(Postpone) అయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2ను విడుదల చేస్తామని మేకర్స్ చెప్పారు. కొంత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి కాబట్టి పోస్ట్‌పోన్ చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమయ్యింది. అల వైకుంఠపురం సినిమా పెద్ద హిట్టు కొట్టడంతో బన్నీ క్రేజ్ అమాంతం పెరిగింది. నైజాంలోనే 40 కోట్ల రూపాయలకుపైగా షేర్ వచ్చింది. పుష్ప సినిమా అంతకు మించి పోతుందని అనుకున్నారు కానీ అల వైకుంఠపురం అంత కాలేదు. బయ్యర్లు పూర్తిగా సేఫ్ కాలేదని టాక్.. అయితే ఉత్తరాదిలో సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 మీద అంచనాలు పెరిగాయి. మేకర్స్ కూడా కొండంత నమ్మకం పెట్టుకున్నారు. కాకపోతే పుష్ప 2 విడుదల వాయిదా పడటమే ఫ్యాన్స్‌కు నిరుత్సాహానికి గురి చేసింది. 2020 జనవరిలో అల వైకుంఠపురములో సినిమా వచ్చింది. 2021 డిసెంబర్‌లో పుష్ప రిలీజయ్యింది. ఆల్‌మోస్టాల్ రెండేళ్ల తర్వాత అన్నమాట! ఇప్పుడు పుష్ప 2ను డిసెంబర్‌లో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. అంటే మూడేళ్ల గ్యాప్ అన్నమాట! ఓ పెద్ద హీరో సినిమాకు ఇంత గ్యాప్ వస్తే ఎలా? పుష్ప 2 విడుదలైతే తప్ప అల్లు అర్జున్ మరో సినిమాకు కమిట్ కాలేడు. కాకపోతే ఫలానా వారి సినిమానే చేస్తానని బన్నీ చెప్పలేదు. తనకు నచ్చేకథను, అది కూడా రెడీగా ఉంచి తెస్తే వాళ్లతోనే సినిమా చేస్తానని ఇది వరకే అల్లు అర్జున్ ప్రకటించి ఉన్నాడు. ఈ కారణం వల్లే పెద్ద దర్శకులెవరూ అర్జున్‌తో సినిమా తీయడానికి సాహసించడం లేదు. వారెవ్వరూ బౌండ్ స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టుకోరు. హీరోలకు ఓ లైన్ చెబుతారు. అతగాడు ఓకే అంటేనే స్టోరీని డెవలప్ చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో బన్నీ కొత్త సినిమాకు ఓకే చెప్పినా, అది సెట్స్ మీదకు వెళ్లి, షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రెడీ అవ్వడానికి ఎంత కాదనుకున్నా ఏడాదిన్నర పడుతుంది. అంటే 2025 డిసెంబర్‌కు సిద్ధమవుతుందన్నమాట! బన్నీతో సినిమా తీయడానికి ఇప్పుడు త్రివిక్రమ్ ఒక్కరే రెడీగా ఉన్నాడు. టాప్ డైరెక్టర్లు సందీప్ వంగా, ప్రశాంత్ నీల్, ఆట్లీలకు అర్జున్‌తో సినిమా తీయాలని ఉన్నా వెనుకంజ వేస్తున్నారు. ఎందుకంటే సినిమాలో బన్నీ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. అది వారికి నచ్చకపోవచ్చు.