పుష్ప 2 సినిమా టాక్ ఎలా ఉన్నా అందులో రెండు మూడు డైలాగుల విషయంపై పెద్ద దుమారం రేగుతోంది.
పుష్ప 2 సినిమా టాక్ ఎలా ఉన్నా అందులో రెండు మూడు డైలాగుల విషయంపై పెద్ద దుమారం రేగుతోంది. మెగా అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా లో దీనిపైనే పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వివాదంపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ స్పందించింది. సినిమాలో అలాంటి డైలాగులు లేనే లేవని స్పష్టం చేసింది. అసత్యాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎక్స్ అకౌంట్ లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చింది.
'ఊహాజనితమైన, సొంత క్రియేటీవిటితో పుట్టించిన కొన్ని డైలాగులు పుష్ప-2 చిత్రంలోనివి అంటూ కొంత మంది కావాలని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. వాంటెడ్ గా కొంత మంది సినిమాపై నెగటివ్ ప్రచారం కోసం కావాలని ఇలాంటివి పోస్ట్ చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి పోస్టులు పోస్ట్ చెయ్యటం
మానుకోకపోతే అలాంటి వారిపై చట్ట పరమైన యాక్షన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం' అని హెచ్చరించింది మైత్రీ మూవీస్ సంస్థ.