ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదలై కలెక్షన్లలో దూసుకెళ్తుంది.

ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 విడుదలై కలెక్షన్లలో దూసుకెళ్తుంది. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక మందన్న(Rashmika Mandanna), ఫహద్ ఫాసిల్ నటించిన చిత్రం వేగంగా 1500 కోట్ల క్లబ్బులో చేరింది. పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్లతో విడుదలైంది. అప్పటి నుంచి ఈ చిత్రానికి కనకవర్షం కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 1508 కోట్ల గ్రాస్ దాటిపోయింది. పుష్ప 2 బది రూల్‌కి విడుదలై రెండు వారాలు దాటినా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ భాషల్లో భారత్‌తోపాటు ఇతర దేశాల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1500 కోట్లకు పైగా గ్రాస్‌ను తెచ్చిపెట్టిందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 14 రోజుల్లో 1500+ కోట్ల గ్రాస్ సాధించిన వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది.
