మాస్ కా దాస్(Mass Ka Das) విశ్వక్ సేన్(Vishwak Sen) తో ఊరమాస్ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియా(Social Meidia)లో వైరల్ అవుతున్న ఈ వార్తపై పూరీ టీమ్ కూడా స్పందించారు. ఇంతకీ వీరి కాబోలో సినిమా ఉన్నట్టా లేనట్టా.. మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఎంత దూకుడుగా ఉంటాడో తెలుసు.. సినిమాల విషయంలో.. ఊపు ఊపేస్తున్నాడు..
మాస్ కా దాస్(Mass Ka Das) విశ్వక్ సేన్(Vishwak Sen) తో ఊరమాస్ దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh) సినిమా చేయబోతున్నట్టు టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది. సోషల్ మీడియా(Social Meidia)లో వైరల్ అవుతున్న ఈ వార్తపై పూరీ టీమ్ కూడా స్పందించారు. ఇంతకీ వీరి కాబోలో సినిమా ఉన్నట్టా లేనట్టా..
మాస్ కా దాస్ గా పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఎంత దూకుడుగా ఉంటాడో తెలుసు.. సినిమాల విషయంలో.. ఊపు ఊపేస్తున్నాడు.. ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దూకుడు గురించి అందరికి తెలిసిందే.. అటువంటి దర్శకుడి చేతిలో విశ్వక్ పడితే.. మాస్ కా దాస్ కి తాతలాంటి సినిమా బయటకు వస్తుంది.
మంచి దూకుడు మీద ఉన్న హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్లాప్ హట్ అనే తేడా లేకుండా.. తన సినిమాల ప్రభావంతో ఆడియన్న్ అటేన్షన్ ను పట్టేసుకుంటున్నాడు. ఈక్రమంలో విశ్వక్ తో ఊరమాస్ సినిమా చేయాలని పూరీ జగన్నాథ్ భావిస్తున్నాడట. ఈ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఓ వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా విశ్వక్ రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు. ఈ మధ్యే ఆయన నటిస్తూ, దర్శకత్వం వహించిన దాస్ కా ధమ్‌కీ(Das Ka Dhamki)రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటే.. ఫస్డ్ డే నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. .
ఇక పూరీజగన్నాథ్ విషయానికి వస్తే.. ఆయన విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో లైగర్ సినిమా(Liger Movie)చేసి భారీగా దెబ్బ తిని ఉన్నాడు. పాన్ ఇండియా రేంజ్(Pan India Range) లో నష్టపోయాడు. ఈ దెబ్బతో పెద్దగా బయటకు కూడా రావడంలేదు పూరీ. లైగర్ దెబ్బకు విజయ్ తో అనుకున్న జనగనమణ సినిమా(Jana Gana Mana Movie) కూడా ప్రకటన తరువాత ఆగిపోయింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ విశ్వక్ సేన్ ను నమ్మి .. పూరీ సినిమా చేస్తాడా.. చేసి మళ్లీ దెబ్బ తింటాడా అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇది ఇలా ఉంటే.. ఈ విషయంలో పూరీ టీమ్ కూడా స్పందించింది.
ఇక విశ్వక్ సేన్ తో సినిమా విషయంపై పూరి జగన్నాథ్ టీమ్ కూడా స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. అవన్నీ రూమర్స్ అని, అలాంటి పుకార్లను నమ్మొద్దని చెప్పింది. అయితే ఊహించని విధంగా లైగర్ ఫ్లాప్ కావడంతో.. నెక్స్ట్ ఏంటి అని తెలియని కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు పూరీ జగన్నాథ్. విజయ్‌తో పట్టాలెక్కించిన జనగనమణ కూడా మధ్యలోనే ఆగిపోయింది. దాంతో నెక్ట్స్ ఏంటీ అనే కన్ ఫ్యూజన్ లో ఉన్నాడు పూరి. బాలయ్య(Balayya)తో పూరీ జగన్నాథ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో పైసా వసూల్ తో డిఫరెంట్ వేవ్స్ ను క్రియేట్ చేశారు ఇద్దరు. ఇక ఇప్పుుడు ఈ ఇద్దరు కలిస్తే.. రచ్చ రచ్చే.కాని ఈసినిమాపై కూడా క్లారిటీ లేదు. దాంతో అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పూరీ జగన్నాధ్ నెక్ట్స్ సినిమా ఎవరితో నో అని.