మెగా స్టార్‌ చిరంజీవి(Chiranjeevi) బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు.

మెగా స్టార్‌ చిరంజీవి(Chiranjeevi) బర్త్‌డే అంటే మామూలుగా ఉండదు. ప్రపంచవ్యాప్తంగా మెగా ఫ్యాన్స్‌(Mega fans) అందరికి పెద్ద పండుగ రోజు. ఇక సోషల్‌ మీడియా అయితే చిరంజీవి నామస్మరణతో దద్దరిల్లిపోతున్నది. చిరంజీవికి బర్త్‌ డే(Chiranjeevi birthday) విషెస్‌ చెప్పడానికి పోటీ పడుతున్నారు సెలబ్రెటీలు. దర్శకుడు పూరి జగన్నాథ్‌(Purijaganadh) కూడా చిరంజీవి ఫ్యానే! చిరంజీవితో సినిమా తీయాలన్నది పూరి చిరకాల వాంఛ. వీరి కాంబినేషన్‌లో ఎప్పుడో ఓ సినిమా రావాల్సి ఉండింది. ఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇలా రెండు మూడు సార్లు జరిగాయి. చిరంజీవి గురించి పూరి జగన్నాథ్‌ గతంలో చెప్పిన ఓ ముచ్చటను రీవైండ్ చేసుకునే సందర్భం ఇది కాబట్టి ఆ పాత జ్ఞాపకాన్ని ఓసారి నెమరేసుకుందాం! ఆ ఎనర్జటిక్ డైరెక్టర్ తనకు తెలిసిన… తనే ప్రత్యక్షంగా చూసిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఏడాది కిందట అందరిలో పంచుకున్నారు. చిరుకు బర్త్‌ డే విషెస్ చెబుతూ అప్పుడు ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో నిజంగా జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఓ పన్నెండేళ్ల కిందట జరిగిన సంఘటన! ఇయర్‌ గుర్తు లేదు కానీ చిరంజీవి ఓ చిన్న కారు వేసుకుని పూరీ ఆఫీసుకు వెళ్లారు. ఇక ఇక్కడ్నుంచి పూరీ మాటల్లోనే స్టోరీని తెలుసుకుందాం .' బోర్‌ కొడుతుంది..అలా బయటకు వెళ్లి వద్దాం రా అని నాతో అని నన్ను కారు ఎక్కించుకున్నారు.మాదాపూర్‌ వైపుగా కారు వెళుతోంది. అప్పట్లో మాదాపూర్‌ ఇప్పుడంతగా డెవలప్‌ కాలేదు. మట్టి రోడ్లతో పచ్చటి చెట్లతో ఉంది. అలా కారులో మేమిద్దరమే ఉన్నాం. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళుతున్నాం. అంతలోనే నిర్మానుష్యంగా ఉన్నో ప్రదేశంలో రోడ్డు పక్కగా ఉన్న ఓ చిన్నపాన్‌ షాపును చిరంజీవి చూశారు. వెంటనే ఆ పాన్‌ డబ్బా ముందు కారు ఆపి దిగారు. కస్టమర్లు లేక ఖాళీగా కూర్చున్న ఆ పాన్‌ డబ్బా అతను చిరంజీవిని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడు. మెగాస్టార్‌ అని గట్టిగా అరుస్తూ పాన్‌ షాపులోంచి బయటకు దూకేశాడు. చిరును చూసిన ఆనందంలో అతడికి మాటలు రావడం లేదు. అలాగే చిరంజీవిని చూస్తూ నిల్చుండి పోయాడు. ఏం చేయాలో అతడికి పాలుపోవడం లేదు. అప్పుడు చిరంజీవి ఆ మనిషి భుజం తట్టి ఓ మంచి పాన్‌ కట్టివ్వు అని అన్నాడు. దాంతో ఆ పాన్‌ డబ్బా అతడు మళ్లీ ఒక్క ఉదుటున డబ్బాలోకి దూరిపోయాడు. పాన్‌ కడుతూ కూడా మెగాస్టార్‌ మెగాస్టార్‌ అని అరుస్తూ చుట్టూ చూస్తున్నాడు. అందుకో కారణం ఉంది. మెగాస్టార్‌ చిరంజీవి తన షాపుకు వచ్చిన విషయాన్నిఎవరూ చూడటం లేదన్న బాధ అతడి మొహంలో కనిపించింది. ఇక్కడ ఎవరూ లేరని నేను అతడితో చెప్పాను. కానీ నా అదృష్టం బాగుండి ఆ టైంలో నేను చిరు పక్కన ఉన్నా లేకపోతే నేను కూడా చిరును ఫస్ట్ టైం చూసి అలానే చేసేవాడిని. నేనే కాదు చిరు ను ఫస్ట్‌ టైం చూసిన ఎవరి రియాక్షనైనా ఇలాగే ఉంటుంది' అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు. నిజమే ఈ విషయాన్ని పాన్‌ డబ్బా అతడు చెబితే ఎవరూ నమ్మేవారు కాదు. చిరంజీవి నీ షాపు కొచ్చాడా అని పరాచకాలాడేవారు. ఏమైనా చిరంజీవి సింప్లిసిటీకి ఈ సంఘటన ఓ బెస్ట్ ఎగ్జాంపుల్‌.

Eha Tv

Eha Tv

Next Story