ప్రేక్షకులు ఓటీటీలపై(OTT) మనసు పారేసుకున్నది మీర్జాపూర్‌(Mirzapur) వెబ్‌ సిరీస్‌(Webseries) నుంచేనన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన నిజం!

ప్రేక్షకులు ఓటీటీలపై(OTT) మనసు పారేసుకున్నది మీర్జాపూర్‌(Mirzapur) వెబ్‌ సిరీస్‌(Webseries) నుంచేనన్నది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిన నిజం! నటీనటుల నటనా వైదుష్యం, డైలాగులు, బ్యాక్‌డ్రాప్‌, కాసింత హింస ఇవన్నీ కలిసి మీర్జాపూర్‌ను కళ్లప్పగించి చూసేలా చేశాయి. అసలు ఈ వెబ్‌ సిరీస్‌లోని పాత్రలపై వచ్చినన్ని మీమ్స్‌ మరే వెబ్‌సిరీస్‌పైనా రాలేదంటే నమ్మి తీరాలి. అందుకే మీర్జాపూర్‌ సీజన్‌ 1, సీజన్‌ 2 సూపర్‌హిట్టయ్యాయి. సీజన్‌ 3 కోసం ఎదురుచూసేలా చేశాయి. క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌ రెండు సీజన్లు విజయవంతమయ్యాయి. ఇప్పుడు మూడో సీజన్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌(Amazon prime) వేదికగా సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ అవుతోంది. మీర్జాపూర్‌ 2 కథ ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచి సీజన్‌ 3 మొదలవుతుంది. సోదరుడు బబ్లూ పండిత్‌, సతీమణి స్వీటి మరణం తర్వాత ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంటాడు గుడ్డు పండిత్‌ (అలీ ఫజల్‌). కాలీన్‌భయ్యా (పంకజ్‌ త్రిపాఠి). మున్నా భాయ్ (దివ్వేందు శర్మ)పై అటాక్‌ చేస్తాడు. వాళ్లిద్దరిని షూట్‌ చేస్తాడు. ఇందులో మున్నా చనిపోతాడు. కానీన్‌ భయ్యా భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్‌) అండతో మీర్జాపూర్‌ కొత్త డాన్‌ అవుతాడు గుడ్డు. గోలు అతడిని మద్దతుగా నిలుస్తుంది. వీరిద్దరు మీర్జాపూర్‌ను తమ కంట్రోల్‌లో ఉంచుకోగలిగారా? వీరికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ముఖ్యమంత్రి మాధురి టార్గెట్ ఏమిటి? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే మీర్జాపూర్‌ సీజన్‌ 3 చూడాలి.

అయితే మొదటి రెండు సీజన్‌ల ఉన్నట్టుగా మూడో సీజన్‌ లేదని ప్రేక్షకులు అంటున్నారు. అంచనాలను అందుకోలేకపోయిందని చెబుతున్నారు. డార్క్‌ హ్యూమర్‌ ఇందులో మిస్సయ్యిందని అంటున్నారు. మొదటి రెండు సీజన్‌లు గుర్తులేని ప్రేక్షకుల కోసం కుప్లంగా కథను తెలుసుకుందాం! మీర్జాపూర్‌ సీజన్‌ 1 విషయానికి వస్తే మీర్జాపూర్‌లో అఖండానంద్‌ అలియాస్‌ కాలీన్‌ భాయ్‌ (పంకజ్‌ త్రిపాఠి) బడా మాఫియా డాన్‌. డ్రగ్స్‌, ఆయుధాలు అతడి ప్రధాన వ్యాపారాలు. ఓ పెళ్లి వేడుకలో కాలిన్‌ భాయ్‌ కుమారుడు మున్నా తుపాకీ పేలుస్తాడు. ఆ ఘటనలో పెళ్లికొడుకు చనిపోతాడు. దాంతో పెళ్లి కొడుకు కుటుంబం రమాకాంత్‌ పండిత్‌ అనే న్యాయవాదిని కేసు నిమిత్తం నియమించుకుంటుంది. నిజాయితీపరుడైన రమాకాంత్‌కు ముగ్గురు సంతానం. గుడ్డుపండిత్‌, బబ్లూ పండిత్‌, డింపి. కాలీన్‌ భాయ్‌ తన వ్యాపార సామ్రాజ్యాన్ని కొడుకుకు కాకుండా గుడ్డు, బబ్లూలకు అప్పగిస్తాడు. దీంతో మున్నాలో అసంతృప్తి మొదలవుతుంది. డింపీ స్నేహితురాలైన స్వీటీని గుడ్డు ప్రేమిస్తాడు. స్వీటి తనకే దక్కాలని అనుకుంటాడు మున్నా. ఇదిలా ఉంటే ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న గుడ్డు, గోలు (శ్వేతా త్రిపాఠి), స్వీటీ, బబ్లూ, డింపీలపై మున్నా దాడి చేస్తాడు. అందులో స్వీటితో పాటు, బబ్లూ చనిపోతాడు. మిగతా వారు తప్పించుకుంటారు. కాలీన్‌ భాయ్‌ ఓ పోలీస్‌ ఆఫీసర్‌ను హత్య చేయడంతో సీజన్‌ 1 ముగుస్తుంది. సీజన్‌-2లో డ్రామా ఎక్కువగా ఉంది. భావోద్వేగాలతో కూడిన కథ ఉంది. హాస్పిటల్‌లో మున్నా చికిత్స పొందుతున్న సీన్‌తో సీజన్‌ 2 మొదలవుతుంది. పొందుతూ ఆరంభమయ్యే సన్నివేశాలతో సీజన్‌-2 మొదలవుతుంది. మున్నా దాడి నుంచి తప్పించుకున్న గోలు, గుడ్డులు ఓ డాక్టర్‌ను కిడ్నాప్‌ చేసి, చికిత్స పొందుతారు. మున్నా చేసిన దారుణానికి ప్రతీకారం తీర్చుకోవాలని పంతం పడతారు. అందుకే గోలు తుపాకీ షూటింగ్‌ నేర్చుకుంటుంది. సమయం చూసి మున్నాపై దాడికి దిగుతారు. ఇందులో కాలీన్‌ భాయ్‌ తీవ్రంగా గాయపడతాడు. అతడిని శరద్‌ కాపాడతాడు. మరోవైపు మున్నాను గుడ్డు చంపేస్తాడు.

Eha Tv

Eha Tv

Next Story