తాజా సమాచారం మేరకు, పొన్నియిన్ సెల్వన్ 2(PS 2) హై డెఃఫినిషన్ ప్రింట్లు చాలా అక్రమ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు నిర్మాతలు హెచ్చరికలు జారీ చేసినా సరే, నటీనటులు సైతం ఎంతగా అభ్యర్ధించినా కూడా హెచ్‌డి ప్రింట్లు లీక్ కాకుండా కాపాడలేకపోయారు.
తాజా సమాచారం మేరకు, పొన్నియిన్ సెల్వన్ 2(PS 2) హై డెఃఫినిషన్ ప్రింట్లు చాలా అక్రమ వెబ్ సైట్లలో దర్శనమిస్తున్నాయి. ఎన్ని రకాలుగా, ఎన్నిసార్లు నిర్మాతలు హెచ్చరికలు జారీ చేసినా సరే, నటీనటులు సైతం ఎంతగా అభ్యర్ధించినా కూడా హెచ్‌డి ప్రింట్లు లీక్ కాకుండా కాపాడలేకపోయారు. ఏప్రిల్ 27నాడే మేకర్స్ అందరికీ విజ్ఞప్తి చేసి, దయచేసి వీడియో పైరసీకి పాల్పడవద్దని ఎంతో అభ్యర్ధించారు. పైగా, ఎవరైనా వీడియో పైరసీకి గానీ పాల్పడితే వెంటనే ఫిర్యాదు చేసి సమాచారమందివ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్‌ని కూడా అప్పుడే ప్రకటించారు.
దీనికి ముఖ్యకారణం పిఎస్ 2కి వచ్చిన ప్రచారం.
మొదటి భాగం కన్నా కూడా రెండో భాగం అదిరిపోయిందిట అనే భారీ టాక్ ఊపందుకోగానే అందరి కళ్ళూ దాని మీద పడ్డాయి. ఎవడి పనిలో వాడుంటాడు. మణిరత్నం అండ్ కో రిలీజ్ హడావుడిలో ఉంటే పైరసీగాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ప్రతీ వెబ్ సైట్ అది ఏభాషదైనా, పిఎస్ 2 ఫొటోలతోనే నిండిపోయి, ప్రతీ సైట్ పిఎస్ 2 సైట్‌లా తయారైంది. ఈ పండగ వాతావరణంలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే, మరో పక్క ఈ లీక్ న్యూస్ మాత్రం అందరినీ కృంగదీసేసింది. అందరూ ఆయ్యో అయ్యో అని వాపోవడం మొదలు పెట్టారు.
ఎంత గగ్గోలు పెట్టి చెప్పినా సరే, అభిమానులు పెడచెవిన పెట్టి పైరసీ కార్యక్రమాన్ని పిఎస్ 2 విడుదల అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ లీక్ చేసి పారేశారు.
ఎంత చెప్పినా అంతా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే అయింది ఫైనల్‌గా.
అయితే ఇంకా మేకర్స్ పైరసీకి పాల్పడిన వారి మీద, సినిమా స్ట్రీమింగ్ అవుతున్న, చేస్తున్న అక్రమ సైట్ల మీద ఎటువంటి కంప్లైంటూ చేయలేదు. ప్రస్తుతానికి పిఎస్ 2కి లభించిన స్ట్రాంగ్ టాక్‌ని యూనిట్ ఎంజాయ్ చేసే పనిలో పడ్డారు.
అయినా కూడా, పిఎస్ 2 అనే సినిమా ఆద్యంతం కేవలం ధియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ తప్పితే, ఆన్ లైన్‌లో చూసి ఎంజాయ్ చేయగలిగేది కాదు. కానీ కనెక్ట్ చేసుకుని, హోం ధియేటర్లలో వేసి చూసుకోవడానికి అయితే ఓకే. కానీ, ధియేటర్ ఎక్స్పీపీరియన్స్ అనేది గోల్డ్. దాన్ని ఎప్పటికీ ఏదీ అస్సలు కొట్టనే లేదు.