తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మృతిచెందారు. డేనియల్ బాలాజీ ప్రస్తుత వయస్సు 48 సంవత్సరాలు. డేనియల్ బాలాజీ పూర్తిపేరు టీసీ బాలాజీ.

Prominent Tamil actor Daniel Balaji dies of heart attack
తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ మృతిచెందారు. డేనియల్ బాలాజీ ప్రస్తుత వయస్సు 48 సంవత్సరాలు. డేనియల్ బాలాజీ పూర్తిపేరు టీసీ బాలాజీ. బాలాజీ ఆకస్మిక మృతి ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలాజీ గుండెపోటుతో శుక్రవారం మరణించారు. బాలాజీకి అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో.. చెన్నైలోని కొట్టివాకంలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు.
డానియల్ బాలాజీ భౌతికకాయానికి శనివారం పురశైవలకంలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. డేనియల్ మరణంతో అతని సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
దర్శకుడు మోహన్ రాజా ఆయనకు నివాళులర్పించారు. "చాలా విచారకరమైన వార్త. నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి ఆయనే స్ఫూర్తి. గొప్ప స్నేహితుడు. అతనితో పనిచేయడం మిస్ అవుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
