లవకుశ (lavakusha) సినిమాను రంగుల్లో తీయాలనుకోవడం పెద్ద సాహసమే! శంకర్‌రెడ్డి (shankar reddy) సాహసికుడు, స్వాప్నికుడు కాబట్టే లవకుశ సినిమా రంగుల్లో రూపుదిద్దుకుంది. అప్పట్లో గేవాకలర్‌ ఒక్కటే ఉండింది. గేవాకలర్‌ (Gevacolor) సినిమా షూటింగ్ జరగాలంటే చాలా కరెంట్‌ కావాలి.

లవకుశ (lavakusha) సినిమాను రంగుల్లో తీయాలనుకోవడం పెద్ద సాహసమే! శంకర్‌రెడ్డి (shankar reddy) సాహసికుడు, స్వాప్నికుడు కాబట్టే లవకుశ సినిమా రంగుల్లో రూపుదిద్దుకుంది. అప్పట్లో గేవాకలర్‌ ఒక్కటే ఉండింది. గేవాకలర్‌(Gevacolor) సినిమా షూటింగ్ జరగాలంటే చాలా కరెంట్‌ కావాలి. ఎంత అంటే స్టూడియోలో ఇద్దరు నిర్మాతలు రెండు సెట్లపై ఉపయోగించే విద్యుచ్ఛక్తి ఈ ఒక్క సినిమాకే కావాల్సి ఉంటుంది. లవకుశ షూటింగ్‌కువాడిన విద్యుత్‌ లైట్లు చాలా కాంతివంతమైనవి. వాటిని టెనర్‌ అంటారు. ఎక్కువ విద్యుత్‌ కాంతినిచ్చే టెనర్‌ లైట్లను లవకుశ కోసం ఉపయోగించారు. టెనర్‌ చాలా కరెంట్‌ను కరగించుకుని మెరుపులాంటి కాంతని వెదజల్లేది. ఆ లైట్‌ను సూటిగా చూడటం చాలా కష్టం. అంతటి కాంతి ఉంటే తప్ప గేవాకలర్‌ ఫిలింపై షూటింగ్‌ చేయలేము. ఈ టెనర్‌ లైట్లను లవకుశ సినిమాకు సమకూర్చింది ఫిలింసెంటర్‌ అంబాలాల్‌ పటేల్‌. అయితే సినిమా ఆసాంతమూ ఈ లైట్లను వాడలేదు. 1958లో మార్చి నెలలో జరిగిన ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో తీసిన కొన్ని సీన్లకు టెనర్‌ లైట్లను వాడలేదు. అందుకే ఆ సన్నివేశాలు చాలా డల్‌గా ఉంటాయి. రంగులు కూడా కాంతి విహీనంగా ఉంటాయి. సినిమా స్టూడియోలలో షూటింగ్‌లకు అవసరమైన లైట్లను విదేశాల నుంచి ఎగుమతి చేసుకునేవారు. అంబాలాల్‌ పటేల్‌కు ఆ లైట్లను మనమే ఎందుకు తయారు చేయకూడదు అని అనుకున్నారు. ఆలోచన రావడమే తరువాయి యూరప్‌కు వెళ్లారు. అక్కడి దేశాలన్నీ పర్యటించారు. ఫిలిం పరికరాలను తయారుచేసే కేంద్రాలన్నింటినీ సందర్శించాడు. బెల్జియంలోని ఆన్‌ట్వర్స్‌లో ఉన్న గేవార్ట్‌ ఫోటో ప్రొడక్షన్‌తో ముచ్చటించారు. మన దేశంలో స్టూడియో లైట్ల నిర్మాణానికి ఒక ఉమ్మడి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇండియా వచ్చిన తర్వాత పటేల్ ఇండియా కంపెనీ పేరుతో ఓ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. లైట్లను ఇక్కడే తయారు చేయించాడు. లవకుశ సినిమా నిర్మాణం 1958 చివరలో ఆగిపోయి మళ్లీ 1962లో మొదలయ్యిందని చెప్పుకున్నాం కదా? అప్పటికే బాలీవుడ్‌లో కలర్‌ సినిమాలు రావడం మొదలయ్యాయి. టెనర్‌ లైట్ల వాడకం కూడా పెరిగింది. లవకుశ సినిమాలో ఈ లైట్లను వాడిన సన్నివేశాలలో నటీనటులు మెరిసిపోతుంటారు. వాడని చోట్ల మొహాలు వాడిపోయి కనిపిస్తుంటారు.

Updated On 28 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story