మెగా హీరో రాంచరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తూ వస్తోన్న సినిమాపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మెగా హీరో రాంచరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తూ వస్తోన్న సినిమాపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ మధ్యనే గ్లింప్స్ చూశానని, అది తనను ఎంతో ఆకట్టుకుంది తెలిపారు. ప్రత్యేక రూపొందించిన ఓ సీన్ కోసం గ్లింప్స్‌ను ప్రేక్షకులు కనీసం వెయ్యి సార్లు చూస్తారని జోష్యం చెప్పారు. రాబిన్‌హుడ్‌ను ప్రసాద్ ఐమ్యాక్స్‌లో విడుదల చేస్తామని ఆయన అన్నారు. ప్రీమియర్ షోలు తము కలిసి రాలేదని అందుకే 'రాబిన్‌హుడ్' విషయంలో ఆ ఆలోచన లేదు'' అని తెలిపారు. 2026 తమకు చాలా ప్రత్యేకమన్నారు. తాము నిర్మిస్తున్న పలు భారీ బడ్జెట్ చిత్రాలు 2026లో విడుదల కానున్నాయన్నారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్- బుచ్చిబాబు, ప్రభాస్- హను రాఘవపూడి, రిషబ్‌శెట్టి- ప్రశాంత్ వర్మ, విజయ్ దేవరకొండ- రాహుల్ సాంకృత్యన్, పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబినేషన్ చిత్రాలు ప్రత్యేక ప్రాజెక్టులు అలా అయ్యాయి.
