ప్రాజెక్ట్ కె సినిమాను ఇంకాస్త భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్అశ్వీన్. అందుకే... ఈసినిమాలో ప్రభాస్ తో ఢీ కొట్టించడానికి లోక నాయకుడు కమల్ హాసన్ ను ఒప్పించే పనిలో ఉన్నాడట.

ప్రాజెక్ట్ కె(Project K) సినిమాను ఇంకాస్త భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగ్అశ్వీన్(Nag Ashwin). అందుకే... ఈసినిమాలో ప్రభాస్(Prabhas) తో ఢీ కొట్టించడానికి లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hassan) ను ఒప్పించే పనిలో ఉన్నాడట.

ప్రభాస్, అమితాబచ్చన్(Amithab) , దీపికా పదుకొణె(Deepika padukone) లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈ వర్కింగ్ టైటిల్ తో శరవేగంగా సినిమా తెరకెక్కుతోంది. ఈమూవీ కోసం దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు.. సినిమా లవ్వర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈసినిమా ఎంత భారీ స్థాయిలో ఉండబోతోందో రీసెంట్ గా రిలీజ్ చేసిన టైర్ వీడియోనే చెపుతోంది. ఈక్రమంలో ఈసినిమాకు ఇంకా భారీ తనం ఆడ్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ తో ఆయనకంటే పవర్ ఫుల్ విలన్ ఉంటే బాగుంటుంది అని భావించిన మూవీ మేకర్స్.. ఆ పాత్ర కోసం లోకనాయకుండు కమల్ హాసన్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది.

ప్రభాస్ కు విలన్ గా.. చాలా పవర్ ఫుల్ పాత్రకు కమల్ హాసన్ ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట మూవీ టీమ్. అంతే కాదు.. ఈమూవీ నిర్మాత అశ్వనీదత్ ఈ పాత్రకోసం కమల్ కు ఏకంగా 150 కోట్ల ఆఫర్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. కాని ఇందులో నిజం లేదని ఇండస్ట్రీలో మరో వర్గం నుంచి సమాచారం అందుతోంది. అయితే ఈ పాత్రకోసం కమల్ హాసన్ ను సంప్రదించిన మాట నిజమే కానీ, 150 కోట్ల రెమ్యునరేషన్ వార్తలు నిజం కావని సినిమా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

కమల్ హాసన్ తో చర్చలు మొదలయ్యాయని, ఇంకా కమల్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. కమల్ తన నిర్ణయం చెప్పేందుకు మరో ఒకటి రెండు వారాల సమయం పట్టొచ్చని ప్రాజెక్ట్ కే సినిమా వర్గాలు తెలిపాయి. ప్రాజెక్ట్ కే సినిమా ఇప్పటికే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె పాత్రలకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుందని సమాచారం.

పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ అటు ఆదిపురుష్, సలార్ తో పాటు రాజా డీలక్స్ లాంటి సినిమాలు చేస్తున్నాడు. ఇటు ప్రాజెక్ట్ కేతో భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈమూవీ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. మరి ఈసినిమా అంచనాలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Updated On 31 May 2023 11:52 PM GMT
Ehatv

Ehatv

Next Story