రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజిగా ఉన్నాడు. అయితే సలార్ (Salaar) సినిమా తర్వాత ప్రభాస్(Prabhas), ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‏లో ఓ మైథలాజికల్ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా రావణం (Raavanam) అనే టైటిల్‏తో ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు (Dil Raju) మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఓ గుడ్ న్యూస్ చెప్పేశారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఈ సినిమా వస్తున్నట్టు రివిల్ చేశాడు. ఇప్పటికే వీరిద్దరు సలార్ సినిమాకు కలిసి పనిచేస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ప్రొడ్యూసర్ దిల్ రాజు అనౌన్స్‏మెంట్‏తో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగాయి. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఇప్పటికే తన స్క్రిప్ట్‏ను ఫైనల్ చేసి.. హీరో ప్రభాస్‏తో చర్చలు జరుపుతున్నారట. సలార్ తర్వాత ప్రశాంత్‏కు ఎన్టీఆర్‏తో కమిట్‏మెంట్ ఉంది కాబట్టి ఎన్టీఆర్ (NTR) సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక సలార్ (Salaar) సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని, మరికొద్ది వారాల్లో ఈ సినిమాకు సంబంధించిన టీజర్‏ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‏తోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతిహాసన్ నటిస్తున్నారు. సలార్ (Salaar) సినిమాకు కేజీఎఫ్(K.G.F) చిత్రానికి మ్యూజిక్ అందించిన రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

సలార్‏తోపాటు ప్రాజెక్ట్ కే (Project K)లో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే నటిస్తుండగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను 2024లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

Updated On 13 April 2023 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story