సౌత్ ఇండియన్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) నటించిన చిత్రం శాకుంతలం(Shaakuntalam). ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. మొదటి రోజే సమంత అభిమానులకు.. సినీ అభిమానులకు కోలుకోలేనంతగా గట్టి షాక్ ఇచ్చింది ఈ చిత్రం. డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar), నిర్మాత దిల్ రాజు (Dil Raju) కాంబినేషన్‏లో వచ్చిన శాకుంతలం ఫస్ట్ డేనే భారీ డిజాస్టర్‏ను సొంతం చేసుకుంది.

సౌత్ ఇండియన్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) నటించిన చిత్రం శాకుంతలం(Shaakuntalam). ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బొక్కబోర్లా పడింది. మొదటి రోజే సమంత అభిమానులకు.. సినీ అభిమానులకు కోలుకోలేనంతగా గట్టి షాక్ ఇచ్చింది ఈ చిత్రం. డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar), నిర్మాత దిల్ రాజు (Dil Raju) కాంబినేషన్‏లో వచ్చిన శాకుంతలం ఫస్ట్ డేనే భారీ డిజాస్టర్‏ను సొంతం చేసుకుంది. ఇలా ఉంటే సినిమా కనిపించకుండా పోవడంతో హీరోయిన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఆమె. మహా భారతంలోని శ్లోకం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన..'కర్మణ్యే వాధికా రాస్తేమా ఫాలేషు కదాచన, మా కర్మ ఫల హే తుర్ భూః, మా తే సంగోత్స్వ కర్మణి..' శ్లోకాన్ని ఇంస్టాగ్రామ్‏లో పోస్ట్ చేసింది. అయితే ఓ ప్రయత్నంగా శాకుంతలం (Shaakuntalam) సినిమా చేశామని.. దాని రిజల్ట్ నెగిటివ్‏గా వచ్చిందని.. అదంతా కర్మ ఫలం. అది మన చేతుల్లో ఉండదని మనసులో ఫీలింగ్‏ని చెప్పుకొచ్చింది సమంత.

ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) పరిస్థితి ఏంటి ? ఆ చిత్రంపై దిల్ రాజుకు ఎంత నష్టం వచ్చింది ? ఇప్పుడు అందరి మైండ్స్‏లో రన్ అవుతున్న థాట్స్ ఇవే. శాకుంతలం (Shaakuntalam) సినిమాపై దిల్ రాజు భారీగానే పెట్టుబడులు పెట్టారు. థియేట్రికర్ రిటర్స్న్ రూ.5 కోట్లు లోపే అంటే అది ఈ చిత్ర బడ్జెట్‏లో 10 శాతానికంటే తక్కువే అంటున్నారు విశ్లేషకులు. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్‏లోనే అత్యంత కాస్ట్లీ డిజాస్టర్‏గా రికార్డు సొంతం చేసుకుందట. ప్రొడక్షన్ వాల్యూస్ దాదాపు 60 కోట్లు అయ్యాయట. ఇక ప్రమోషన్ల ఖర్చులు కూడా జోడిస్తే ఇంకాస్త పెరగొచ్చంటున్నారు. రూ.35 కోట్ల ఓటీటీ రైట్స్ కోసం డీల్ కుదుర్చుకున్నారని.. ఒకవేళ ఆ డీల్ సెట్ అవ్వకపోతే నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju-Producer) ఈ సినిమాతో రూ.20 కోట్లకుపైగా నష్టపోనున్నారు.. ఇటు డైరెక్టర్ గుణశేఖర్ (Gunasekhar) కూడా భారీగా నష్టపోతారంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ శాకుంతలం చిత్రం ఎవరూ ఊహించని రీతిలో అతి భారీ నష్టాలతో నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పాలి.

Updated On 19 April 2023 5:29 AM GMT
Ehatv

Ehatv

Next Story