హీరలకు ఫాన్స్ ఉంటారు. హీరోయిన్స్‌కి ఉంటారు. కొన్ని చోట్ల రాజమౌళి(Rajamouli) లాంటి దర్శకుడికైతే కూడా ఓకే. కానీ ఓ నిర్మాతకి...ఎప్పుడూ తెరమీద కనిపంచని, కనిపించి ఫైట్స్ చేయని, డాన్స్‌లు చెయ్యని, డైలాగులు చెప్పని ఓ నిర్మాతకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నమ్మలేం. కానీ ఇప్పుడు నమ్మాలి. దిల్‌రాజే అందుకు ప్రత్యక్ష నిదర్శనం.

హీరలకు ఫాన్స్ ఉంటారు. హీరోయిన్స్‌కి ఉంటారు. కొన్ని చోట్ల రాజమౌళి(Rajamouli) లాంటి దర్శకుడికైతే కూడా ఓకే. కానీ ఓ నిర్మాతకి...ఎప్పుడూ తెరమీద కనిపంచని, కనిపించి ఫైట్స్ చేయని, డాన్స్‌లు చెయ్యని, డైలాగులు చెప్పని ఓ నిర్మాతకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే నమ్మలేం. కానీ ఇప్పుడు నమ్మాలి. దిల్‌రాజే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. నిన్ననే శాకుంతలం సినిమా(Shaakuntalam Movie) త్రిడి ట్రైలర్‌(3D Trailer) మీడియాకి చూపించినప్పుడు, పబ్లిక్‌ కూడా ధియేటర్‌లో తారసపడ్డారు. అప్పటికే చిత్రదర్శకుడు గుణశేఖర్ ఫామిలితో పాటు ధియేటర్‌లో ఉన్నారు. ట్రైలర్‌ స్టార్ట్ అవడానికి కొంతసేపు ముందు దిల్‌రాజు(Dil Raju) ధియేటర్‌లోకి అడుగుపెట్టారు.

ఆయన్ని చూసి జనం మొత్తం ఏదో ఓ మెగాస్టార్‌ చిరంజీవి వచ్చినట్టు, లేదా పవన్‌ కళ్యాణో, రామ్‌చరణో ఎంటర్‌ అయినట్టుగా ఒకటే కేకలు, అరుపులు, ఈలలు. దిల్‌రాజు కూడా కొంత ఆశ్చర్యంలో పడ్డారు. దిల్‌రాజు...దిల్‌రాజు అని ఆపకుండా షౌటింగ్‌తో ధియేటర్‌లో ఊహించని సందడి నెలకొంది. ఓ వైపు సినిమా నిర్మాణం. అది కూడా పెద్ద సినిమాలు, మరోవైపు చిన్న సినిమాలు ఎడాపెడా తీసి 50 చిత్రాలు పూర్తి చేసుకున్న ఓ అభినందనీయమైన ప్రయాణం దిల్‌రాజుది. డిస్ట్రిబ్యూషన్‌, ధియేటర్స్ మేనేజ్‌మెంట్‌, కథలు వినడం..కధాచర్చల్లో పాల్గొనడం వంటి కార్యకలాపాలతో పూర్తి జీవితం సినిమాకే అంకితం చేసిన దిల్‌రాజు హీరోల ఫాన్స్ అందరికీ కూడా తిరుగులేని అభిమాన నిర్మాతగా అవలీలగా ఎదిగారు. సినిమా పరిశ్రమపైనే వెయ్యకళ్ళు పబ్లిక్‌కి. అందుకే దిల్‌రాజుని అందరూ గుండెల్లో పెట్టుకున్నారు.

పిల్లలే తీసినా సరే....వెనుకాముందూ ఉండి చక్రం తిప్పి, బలగం సినిమాకి సంచలన విజయం అందే విధంగా దిల్‌రాజు కష్టపడ్డారు. చిన్నసినిమా కదా అని వదలిపెట్టలేదు. దాంతో పాటు మరో వైపు డార్లింగ్ ఆఫ్‌ మిలియన్స్‌గా పాప్యులర్‌ అయిన సంచలన కథానాయకి సమంతతో గుణశేఖర్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న శాకుంతలం చిత్రంపైన విపరీతమైన అంచనాలు...అంటే సినిమా సినిమాకి ఎదగడమనే అలవాటుకు అలవాటు పడిన నిర్మాతగా దిల్‌రాజు అందరి ఊహల్లో ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటారు. రామ్‌ చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్ పాన్‌ ఇండియా లెవెల్‌లో నిర్మిస్తున్న సినిమాతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకు దిల్‌రాజు అత్యంత ఆప్తుడిగా, ఆత్మీయుడిగా మారిపోయారు.

మొన్ననే రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా జరిగిన భారీఎత్తు వేడుకల్లో పాల్గొన్న దిల్‌రాజుకి అక్కడ కూడా ఘనస్వాగతమే లభించింది. ఎందరు వేదికపైన ఉన్నా దిల్‌రాజు హవా దిల్‌రాజుదే అన్నట్టుగా అభిమానులు ఆయన మాట్లాడుతుంటే రెచ్చిపోయారు. మర్నాడే రామ్‌ చరణ్ కొత్త చిత్రం టైలిట్‌ గేమ్ ఛేంజర్‌ని దిల్‌రాజు ఎనౌన్స్ చేయగానే అది ప్రపంచమంతా మారుమోగిపోయింది. ఆ తర్వాతే శాకుంతలం ట్రైలర్‌ షో. ఇలా వరుస క్రమంలో ప్రతీ నిమిషం వార్తల్లో వ్యక్తిగా ఉంటూ, విశేషాలను వెదజల్లుతూ, విజయాలను నమోదు చేసుకుంటూ మలుపులన్నీ గెలుపులై, అడుగులన్నీ పిడుగులై ముందుకు సాగుతున్నారు కాబట్టే దిల్‌రాజుకి అంత ఫాలోయింగ్‌....ఇదేదో అనాయాచితంగా వచ్చింది కాదు. కష్టపడి, కృషితో, దీక్షతో, అంకితభావంతో పరిగెడుతున్న దిల్‌రాజుకి ఇటువంటి ఫాలోయింగ్‌ ఉండడం సహజమే. పరిశ్రమలో ఎవరెందరు ఆయన్ని విమర్శిద్దామనుకున్నా, ఆయనపై వ్యాఖ్యానాలు చేద్దామనుకున్నా అవన్నీ కంఠశోషగానే మిగులుతాయి తప్పితే దిల్‌రాజు ఎదుగుదలను ఏ విధంగానూ ఆటంకపరచలేవన్నది నిర్వివాదాంశం. ఎగసిపడే పెనుఅలను తొక్కిపెట్టలేరు. అడ్డుకోలేరు. అదీ ఇందులో నీతి.

Updated On 29 March 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story