సి.ఎమ్. రేవంత్ రెడ్డి తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల భేటీ..
నిర్మాత దిల్ రాజు(Producer Dil raju) నేతృత్వంలో ఈ రోజు తెలుగు సినిమాకు చెందిన పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై చర్చ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన సంధ్య ధియేటర్ ఘటన(Sandhya Theater Incident) నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
హీరోలు వెంకటేష్(Venkatesh), వరుణ్ తేజ్(Varun tej), నితిన్(Nithin), కిరణ్ అబ్బవరం(Kiran abbavaram), నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్(Allu arvindh), సునీల్ నారంగ్(Sunil), దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram srinivas), హరీష్ శంకర్(Harish shankar), వీర శంకర్, అనిల్ రావిపూడి(Amnil ravipudi) పాల్గొననున్నారు. డిప్యూటీ సి.ఎమ్. భట్టి(Bhatti Vikramarka), సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati reddy venkat reddy) లు ఈ సమావేశంలో పాల్గొంటారు.
అయితే ఈ భేటీలో బెనిఫిట్ షోలు, అవార్డులు, టికెట్ రేట్లు వంటి అంశాలపై చర్చ జరగనుంది. మరో వైపు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ హైక్ పై గవర్నమెంట్ ఇలా స్పందిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం బెన్ఫిట్ షో లకు పర్మీషన్ ఇవ్వబోమని తేల్చి చెప్పింది. మరి ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు వెలువడనున్నాయి అనేది చూడాలి. సంధ్య ధియేటర్ ఘటనపై కూడా చర్చించే అవకాశం ఉంది.ఆహ్వానం ఉన్నా కూడా చిరంజీవి, నాగార్జున వంటి వారు హాజరవకపోవడం గమనార్హం.