తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా తర్వాత నిర్మాతల మండలిలో చీలికలొచ్చాయి. దాంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాతల సంఘంలో ఉన్నవాళ్లంతా యాక్టివ్ గా మూవీస్ చేయడం లేదని, యాక్టివ్ గా ఉన్నవాళ్లు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు జరిగే నిర్మాతల మండలి ఎలక్షన్స్ సందర్భంగా సి. కల్యాణ్ షాకింగ్ కమెంట్స్ చేశారు. సి.కల్యాణ్ చేసిన కమెంట్స్ దిల్ రాజుపైనే అని […]

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా తర్వాత నిర్మాతల మండలిలో చీలికలొచ్చాయి. దాంతో కొంతమంది ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనే ఒక కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాతల సంఘంలో ఉన్నవాళ్లంతా యాక్టివ్ గా మూవీస్ చేయడం లేదని, యాక్టివ్ గా ఉన్నవాళ్లు కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారని అప్పట్లో న్యూస్ వైరల్ అయింది. అయితే ఇప్పుడు జరిగే నిర్మాతల మండలి ఎలక్షన్స్ సందర్భంగా సి. కల్యాణ్ షాకింగ్ కమెంట్స్ చేశారు.

సి.కల్యాణ్ చేసిన కమెంట్స్ దిల్ రాజుపైనే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. 2019లో మేము ఎన్నికైన తర్వాత నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఈ సారి సంస్థకు ఎవరు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్లని గెలిపించుకోండన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ షాకింగ్ వార్త చెప్పారు. 30 ఏళ్ల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చానన్నారు.

మరోవైపు ప్రొడ్యూర్స్ గిల్డ్, నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నిస్తే.. అధ్యక్ష పదవి మోజులో కొందరు నా ప్రయత్నాని నీరుగార్చారని చెప్పారు. దిల్ రాజు, సి.కల్యాణ్ ప్యానల్స్ వేర్వేరుకాదని అన్నారు. నిర్మాతలు కొందరు దిల్ రాజును పక్కదారి పట్టించారని, ఆయనతో నన్ను పోలుస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. తాను 80 చిన్న సినిమాలు చేశానని.. తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. యాక్టివ్ ప్రొబ్యూర్స్ గిల్డ్ గతంలో షూటింగ్స్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రయోజనాలు కలగలేదన్నారు సి.కల్యాణ్. నిర్మాతల మండలి కార్యదర్శిగా ఉన్న దామోదర్ ప్రసాద్ వల్ల కూడా ఉపయోగం లేదన్నారు.

చిన్న నిర్మాతలకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో అన్యాయం జరుగుతుందన్నారు. చిన్న సినిమాలు లేకపోతే చిత్ర పరిశ్రమ లేదన్నారు ఆయన. గిల్డ్ మాఫియాతో ఇండస్ట్రీ నాశనం అవుతుందని వాపోయారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటు వెనుక దిల్ రాజు ప్రోద్బలం ఎక్కువ ఉందని నిర్మాతలు భావిస్తున్నారట. సి.కల్యాణ్ చేసిన కామెంట్స్ తో ఇండస్ట్రీలో అగ్గి రాజేసినట్టే అయింది.

Updated On 18 Feb 2023 7:55 AM GMT
Ehatv

Ehatv

Next Story