✕
Anil Sunkara Guts : ఏజెంట్ వెనుక అనిల్ సుంకర గట్స్
By EhatvPublished on 27 April 2023 9:09 AM GMT
నిర్మాత దమ్మే ఏ సినిమాకైనా ప్రాణం పోసేది. ఎన్ని ఒత్తిడిలున్నా, ఎంత భారమైనా సరే ఎత్తుకోగలిగే నిర్మాత లభించడం కొన్ని ప్రాజెక్టులకు గొప్ప వరం. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో సురేందర్ రెడ్డి దర్శకుడిగా అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ చిత్రం రేపు భారీ విడుదలకు సిద్దమవుతోందంటే దాదాపుగా సినిమా పరిశ్రమంతా దానివైపే తదేకంగా చూస్తోంది.

x
agent movie
-
- నిర్మాత దమ్మే ఏ సినిమాకైనా ప్రాణం పోసేది. ఎన్ని ఒత్తిడిలున్నా, ఎంత భారమైనా సరే ఎత్తుకోగలిగే నిర్మాత లభించడం కొన్ని ప్రాజెక్టులకు గొప్ప వరం. ప్రస్తుతం అఖిల్ అక్కినేనితో సురేందర్ రెడ్డి దర్శకుడిగా అనిల్ సుంకర నిర్మించిన ఏజెంట్ చిత్రం రేపు భారీ విడుదలకు సిద్దమవుతోందంటే దాదాపుగా సినిమా పరిశ్రమంతా దానివైపే తదేకంగా చూస్తోంది. అనుకున్నదొక్కటి, జరిగింది మరొక్కటి అన్నట్టుగా ఏజెంట్ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ ఒకటైతే, చివరాఖరికి చూసుకుంటే తడిసిమోపెడై, వ్యాపారగణాంకాలనే కలవరపెట్టే స్థాయికి చేరుకుంది. పరిశ్రమలో ఎక్కడ విన్నా ఏజెంట్ సినిమా గురించే చర్చలు వాడిగా వేడిగా సాగుతున్నాయి.
-
- ఏజెంట్ సినిమాని అత్యంత ధైర్యసాహసాలతో నిర్మించడమే కాదు, రిలీజు ముందు లావాదేవీలను కూడా అత్యంత సహనంతో, అమితమైన సంయమనంతో హేండిల్ చేస్తున్న అనిల్‌కే అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. సినిమాలు విజయవంతంగా ప్రదర్శితమవడానికి, అంతే సక్రమంగా విడుదల కావడానికి నిర్మాతల వ్యక్తిత్వ సమగ్రత, కీర్తి ప్రతిష్టలు కూడా ఎంతో దోహదపడతాయనడానికి ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకరకున్న గొప్ప ఇమేజ్ ఎంతో ఉపయోగపడుతోంది.
-
- నిండు కుండ తొణకదు అన్నటుగా అనిల్ సుంకర్ అద్భుతమైన ఒడుపునీ, గ్రిప్పునీ ప్రదర్శిస్తూ ఏజెంట్ సినిమాకి ఊహించని గ్లామర్నీ, గ్రామర్నీ రెండిటినీ తీసుకొచ్చి, సినిమాని ధియేటర్ల ఒడిలోకి చేర్చారు. ఇటీవలి రోజులలో ఇంత రిస్క్, స్టేక్లతో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళిని నిర్మాతలు లేరంటే అందులో పెద్ద అతిశయోక్తి లేదు.
-
- ముందు ప్లాన్ చేసినదేమిటి, చివరికి జరిగినదేమిటి అని చూస్తే మధ్యలో పెద్ద అగాధముంది. కానీ, దానిని ఏమాత్రం కేర్ చేయకుండా, జస్ట్ ఓ చిరునవ్వుతో ముందుకు సాగాలంటే మామ్మూలు గుండె సరిపోదు. 30 చిత్రాల అనుభవం, 12 ఏళ్ళ ప్రయాణం వెరసి అనిల్ సుంకర వ్యక్తిత్వ గోపురం. అందుకేనేమో తన ప్రాడక్ట్ మీద అచంచలమైన విశ్వాసంతో ఉన్న అనిల్ తెలుగు సినిమా అన్ని సరిహద్దులనూ చెరిపేసి, ప్రపంచమంత ఎదిగిందని, ఇక్కడ బల్ల లేదు కానీ, ఉంటే గుద్ది మరీ చెప్పేవాడినని అనిల్ మీడియా ముందే మాట్లాడి అందరికీ షాక్ ఇచ్చారు.
-
- ఎవరో ఒకరో ఇద్దరో బిజెనెస్‌లు, లాభాలు, అమ్మకాల గురించి ప్రస్తావించబోయినా, అయన అంతే ధీటుగా సమాధానమిచ్చి, బ్లాక్ బస్టర్ మాట అటుంచి, సాధారణంగా చెప్పుకునే హెట్ కూడా లేని అఖిల్ సినిమాకి తనదైన మార్కు పాప్యులారిటీని, తనదైన ప్రత్యేకతనీ ఆపాదించి, విడుదలకు ముందు పెద్ద బజ్నే క్రియేట్ చేశారు. అదీ ఆయనలో మెచ్చుకోదగ్గ గొప్పతనం. నిర్మాతంటే అలా ఉన్నప్పుడే ప్రేక్షకులకు కూడా ఆ సదరు సినిమా మీద ఆకర్షణ ఏర్పడుతుంది.
-
- గత పదిహేను రోజులు లేని క్రేజ్, అటెన్షన్ సడన్‌గా నిర్మాతగా అనిల్ ఆర్గనైజ్ చేసిన పబ్లిసిటీ కేంపైన్తో మొత్తం అన్ని చోట్లా భారీగా ఊపందుకుంది. ఏజెంట్ వస్తోంది, వచ్చెస్తోంది అనే కలకలం రేగి, ఎప్పుడెప్పెడా అనే ఆతృత, ఆసక్తి హఠాత్తుగా అలుముకుందంటే దానికి ముమ్మాటికి అనిల్ సుంకరే కారణం. ఆయన మొట్టమొదట మీడియా మీట్లో మాట్లాడిని ఆ నాలుగు మాటలే ఫస్ట్ బజ్‌ని సృష్టించాయి.
-
- ఈ మధ్యన ఊహించని రీతిలో అందరూ అఖిల్‌ని మెచ్చుకోవడం. చాలా కష్టపడ్డాడు, ఏజెంట్ మంచి హిట్ అవుతుందనే ముచ్చట్లు మొదలుపెట్టారు. విడుదలకు ముందుండే అతి సామాన్యమైన స్ట్రెస్ అండ్ స్టెయిన్ తప్పితే మరో రకమైన ఫీలింగే ఆయనలో ఏ కోశాన కనబడలేదు. దీనికి ఆలాటిలాటి గట్స్ సరిపోనే పోవు. కాకపోతే, ఏజెంట్ ఇప్పుడు చాలా పాజిటివ్ అండ్ ప్రామిసింగ్ టాక్‌తో రిలీజ్‌కి సమాయత్తమవుతుంటే అనూహ్యమైన సపోర్ట్ సినిమాకి ఆటోమేటిక్‌గా వచ్చేసింది. రేపు సినిమా రిలీజై హిట్ కొడుతుందన్న టాక్ మాత్రం అనిల్ సుంకర సినిమా మేకింగ్ పేషన్కి టాప్ గేర్ అనే చెప్పాలి. written by నాగేంద్రకుమార్

Ehatv
Next Story