✕
Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా షాకింగ్ నిర్ణయం, యాక్టింగ్ కు స్టార్ హీరోయిన్ గుడ్ బై..?
By EhatvPublished on 13 May 2023 1:42 AM GMT
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా..? బాలీవుడ్, హాలీవుడ్ల్ లలో స్టార్ గా వెలుగు వెలిగిన బ్యూటీ ఫామ్ లో ఉండగా సినిమాలు ఎందుకు వద్దనుకుంటుంది..?

x
Priyanka Chopra
-
- గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా..? బాలీవుడ్, హాలీవుడ్ల్ లలో స్టార్ గా వెలుగు వెలిగిన బ్యూటీ ఫామ్ లో ఉండగా సినిమాలు ఎందుకు వద్దనుకుంటుంది..?
-
- గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. వరుసగా హాలీవుడ్ మూవీస్ చేసుకుంటూ... హాలీవుడ్ వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ ను కూడా పలుకరిస్తుంది. తాజాగా రెండు మూడు ప్రాజెక్ట్ లతో ఆడియన్స్ ను అలరించింది బ్యూటీ. ముఖ్యంగా సిటడియల్ తో సందడి చేస్తోంది.
-
- రీసెంట్ గా లవ్ ఎగైన్ సినిమాతో ప్రేక్షకులను పలుకరించింది ప్రియాంక చోప్రా.. మే 5న రిలీజ్ అయిన ఈసినిమా ఆడియన్స్ ను అలరించడంతో పాటు..ప్రియాంక ఇమేజ్ ను కూడా పెంచింది. ఇక నెక్ట్స్ హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే హాలీవుడ్ మూవీతో సందడి చేస్తోంది బ్యూటీ.. ఈమూవీలో నటిస్తోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈసినిమా.
-
- ఇక ఇలా హాలీవుడ్ లో.. అడపా దడపా బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ.. మంచి ఫామ్ లో ఉంది బ్యూటీ. ఈక్రమంలో సడెన్ గా ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందంటూ వార్త.. ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అవును ప్రియాంక త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట.
-
- ఈ షాకింగ్ న్యూస్ లో నిజం ఎంత అనేది తెలియదు కాని.. ఈన్యూస్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. తన బిడ్డ కోసం ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన గారాల కూతురు మాలతీ మేరీ చోప్రా జోనస్ ను కంటికి రెప్పలా చూసుకోవడం కోసం ప్రియాంక ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని గతంలో కూడా వెల్లడించింది బ్యూటీ.
-
- ప్రస్తుతం నాలుగు పదుల వయస్సులో కూడా ఏమాత్రం తరగని వన్నెలతో.. హాట్ హాట్ గా దర్శనం ఇస్తోంది బ్యూటీ. మంచి ఫామ్ ను కూడా మెయింటేన్ చేస్తోంది. అయితే ఈ వయసులో సినిమాలు చేయటం కంటే.. ఒక్కగానొక్క కూతురు మాలతీ మేరీ చోప్రా జోనస్‌ను చూసుకోవటానికే ఆమె ఎక్కవగా టైమ్ ను కేటాయించాలని అనుకుంటుందట ప్రియాంక.
-
- బాలీవుడ్ లో ఎంతో కష్టపడి స్టార్ హీరోయిన్ గా ఎదిగిందిప్రియాంక చోప్రా.. కొన్నాళ్లకు హాలీవుడ్ చేరింది. అక్కడ పాపులర్ సింగర్ కమ్ హాలీవుడ్ యాక్టర్ నిక్ జానస్ తో ప్రేమలో పడింది. తనకంటే పదేళ్లు చిన్నవాడు అయినా.. ప్రేమించి.. అందరిని ఒప్పించి పెళ్ళాడింది బ్యూటీ. సరోగసి ద్వారా ఓపాపను కూడా కన్నారు ఈజంట.

Ehatv
Next Story