బాలీవుడ్‌లోని(Bollywood) చెత్త రాజకీయాలను భరించలేక హాలీవుడ్‌కు(Hollywood) వెళ్లిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్‌గా బీటౌన్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పారు.

బాలీవుడ్‌లోని(Bollywood) చెత్త రాజకీయాలను భరించలేక హాలీవుడ్‌కు(Hollywood) వెళ్లిన ప్రియాంక చోప్రా(Priyanka Chopra) అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతూ వస్తున్నారు. లేటెస్ట్‌గా బీటౌన్‌లో తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పారు. ఓ సినిమా సెట్‌లో దర్శకుడి మాటలతో చాలా ఇబ్బంది పడినట్టు ప్రియాంక తెలిపారు. ‘నేను హిందీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాకు సంతకం చేశాను. అందులో నాది అండర్‌కవర్‌ ఏజెంట్‌ పాత్ర. సినిమా షూట్‌ మొదలైన రెండో రోజు నాపై ఓ శృంగార సన్నివేశాన్ని చిత్రీకరించాలనుకున్నాడు దర్శకుడు.

నా స్టైలిష్ట్‌ని పిలిచి సీన్స్‌ గురించి ఆమెకు వివరించాడు. ఈ సన్నివేశాలలో ప్రియాంక చోప్రా బ్రా, అండర్‌వేర్‌తోనే కనిపించాలి. అలా కాకపోతే ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎందుకు వస్తారు? అని చాలా అసహ్యంగా, ఇబ్బందికరంగా మాట్లాడాడు. ఆయన మాటలు నా వరకు చేరాయి. నాకు చాలా అవమానంగా అనిపించింది. ఆ సినిమాను రద్దు చేసుకున్నాను. నిర్మాతకు డబ్బు తిరిగి ఇచ్చేశాను' అని ప్రియాంక చోప్పా తెలిపారు. ఒకటిన్నర దశాబ్దం పాటు బాలీవుడ్‌లో టాప్‌స్టార్‌గా ఉన్నారు ప్రియాంక. బాలీవుడ్‌లో నటిస్తున్న సమయంలోనే ఆమెకు క్వాంటికో(Quantico) సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. అది విజయం సాధించడంతో హాలీవుడ్‌లో సెటిల్‌ అయ్యారు ప్రియాంక చోప్రా.

Updated On 25 May 2023 1:52 AM GMT
Ehatv

Ehatv

Next Story