రీసెంట్ గా న్యూయార్క్(New York) లో జరిగిన మెట్ గాలా(Met gala) వేడుకల్లో మెరిసింది బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా(Priyanka chopra). ఈ వేడుకల్లో ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లస్(daimond necklace) హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అందులో అంత స్పెషల్ ఏంటీ..?

priyanka daimond necklace
రీసెంట్ గా న్యూయార్క్(New York) లో జరిగిన మెట్ గాలా(Met gala) వేడుకల్లో మెరిసింది బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీ.. ప్రియాంక చోప్రా(Priyanka chopra). ఈ వేడుకల్లో ప్రియాంక ధరించిన డైమండ్ నెక్లస్(daimond necklace) హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అందులో అంత స్పెషల్ ఏంటీ..?
బాలీవుడ్(Bollywood) లో కష్టపడి ఎదిగింది ప్రియాంక చోప్రా. హాలీవుడ్ స్టార్ నిక్ జోనస్(Nick jonas) ను పెళ్ళాడి హాలీవుడ్ స్టార్ గా మారిపోయింది. అక్కడే సెటిల్ అయ్యింది. అప్పుడప్పుడు బాలీవుడ్ ను పలకరిస్తూ.. కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో.. మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది హాట్ హాట్ ఫోటోలతో కుర్రాళ్ళలోవేడి పుట్టిస్తుంటుంది. ఇక తాజాగా ఆమె న్యూయార్క్ లో గాలా వేడుకల్లో బ్లాక్ డ్రస్(black dress) లో సౌందర్య దేవతలా మెరిసిపోయింది చిన్నది.
ప్రియాంక చోప్రా న్యూయార్క్ సిటీలో జరిగిన 2023 Met Gala ఈవెంట్‌లో మెరిసింది. ఈవెంట్‌లో 11.6 క్యారెట్ల డైమండ్ నెక్లెస్‌ను వేసుకుంది. ప్రియాంక చోప్రా బ్లాక్ డ్రస్ లో.. అద్భుతంగా కనిపిస్తూ.. మెస్మరైజ్ చేస్తూ.. ఉంది. అంతే కాదు మెడలో ఆమె వేసుకున్న డైమండ్ నెక్లెస్ ఈవెంట్ మొత్తంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నెక్లెస్ చూసిన నెటిజన్లు.. దాని రేటు ఎంత.. ఏ బ్రాండ్ అంటూ.. సెర్చ్ చేస్తున్నారు. అయితే దాని రేటు తెలిస్తే మాత్ర కళ్లు తిరక్క మానదు.
ఇక ఈనెక్లస్ రేటు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట వైరలవుతున్న ట్వీట్ ప్రకారం ఇంతకీ ఈ నెక్లెస్ ఖరీదెంతో తెలుసా..? సుమారు 204 కోట్లు(crores).. వింటేనే గుండె గుబేల్ మంటుంది కదా. 204 కోట్ల డైమండ్ నెక్లెస్ తో గాలా ఈవెంట్ లో మహారాణిలా మెరిసింది బ్యూటీ. ఆమె ముందు మిగతా ఆర్టిస్ట్ లు వెల వెల బోయారు. ఇక ఈ ఈవెంట్ లో ఆలియా భట్(alia bhatt) వేసుకున్న లక్షముత్యాల డ్రస్ కూడా స్పెషల్ గా నిలిచింది.
ప్రియాంక చోప్రా వాలెంటినో డిజైన్ చేసిన బ్లాక్ కాస్ట్యూమ్‌లో అందాలు ఆరబోస్తూ ఖరీదైన నెక్లెస్‌తో హొయలుపోతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ప్రియాంక చోప్రా ప్రస్తుతం అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిల్మ్ Love Againలో నటిస్తోంది. సామ్ హెఘాన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ మే 5న గ్రాండ్‌గా విడుదల కానుంది.
