నాచురల్‌ స్టార్‌ నాని(Nani) నటించిన గ్యాంగ్‌ లీడర్‌(Gang Leader) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ నటి ప్రియాంకా అరుళ్‌ మోహన్‌(priyanka Arul Mohan). ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్‌ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అందాల భామ తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. టాప్‌ బ్యానర్లలో సినిమాలు చేస్తున్న ప్రియాంక అరుళ్‌ మోహన్‌కు సోషల్‌ మీడియాలో అభిమానుల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువగా ఉంది.

నాచురల్‌ స్టార్‌ నాని(Nani) నటించిన గ్యాంగ్‌ లీడర్‌(Gang Leader) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ నటి ప్రియాంకా అరుళ్‌ మోహన్‌(priyanka Arul Mohan). ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రం తర్వాత శర్వానంద్‌ సరసన శ్రీకారం సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ అందాల భామ తమిళ్‌, తెలుగు, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. టాప్‌ బ్యానర్లలో సినిమాలు చేస్తున్న ప్రియాంక అరుళ్‌ మోహన్‌కు సోషల్‌ మీడియాలో అభిమానుల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువగా ఉంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా సరికొత్త లుక్‌తో నెటిజన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రంగురంగల సీతాకోక చిలుకలా మెరిసిపోతోంది. ఇప్పుడా ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటిస్తున్న ఓజీలో హీరోయిన్‌గా నటిస్తోంది. సాహో ఫేం సుజిత్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ వచ్చేనెలలో ప్రారంభం కానుంది. ఈ షూట్‌లో పవన్‌ కల్యాణ్‌ జాయిన్‌ కాబోతున్నారని అంటున్నారు. మరోవైపు ధనుష్‌ నటిస్తోన్న కెప్టెన్‌ మిల్లర్‌లో కూడా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కీల రోల్ పోషిస్తోంది. ఇప్పటికే ఓజీలోని పలు సన్నివేశాలను ముంబాయి, పూణే, హైదరాబాద్‌ షెడ్యూల్స్‌లో పూర్తి చేశారు. ఇప్పటికే ఓజీ షూటింగ్‌కు సంబంధించిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి.

Updated On 31 July 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story