ఒక చిన్న కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash varrier). ఆ కన్నుగీటు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తర్వాత ఆమె స్టార్‌గా మారడం తెలిసిందే! ఇంతకు ముందే చెక్(Check) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఇప్పుడు బ్రో(BRO) సినిమాతో మనల్ని అలరించడానికి రెడీ అయ్యింది.
ఒక చిన్న కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్(Priya Prakash varrier). ఆ కన్నుగీటు సోషల్ మీడియాలో వైరల్ కావడం, తర్వాత ఆమె స్టార్‌గా మారడం తెలిసిందే! ఇంతకు ముందే చెక్(Check) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఇప్పుడు బ్రో(BRO) సినిమాతో మనల్ని అలరించడానికి రెడీ అయ్యింది. పవన్‌కల్యాణ్(Pawan Kalyan), సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలతో పాటు, తన వ్యక్తిగత విషయాలను కూడా తెలిపారు ప్రియా ప్రకాశ్. 'నాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. నన్ను సరైన మార్గంలో గైడ్ చేసేవాళ్ళు లేరు. కన్నుగీటే వీడియోతో పాపులరైన తరువాత నాకు అందరూ రకరకాల సలహాలు ఇవ్వడంతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను’ అని చెప్పుకొచ్చారు.
‘కెరీర్ ప్రారంభంలోనే పవన్‌కల్యాణ్ లాంటి గొప్ప నటుడితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన కాంబినేషన్‌లో నాకు సన్నివేశాలున్నాయి. ఆయన తన నటనతో మ్యాజిక్ చేస్తారు. గత చిత్రాలతో పోలిస్తే నేను ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తాను. ఇందులో నా పాత్ర పేరు వీణ(Veena). హోమ్లీ గర్ల్ లాంటి పాత్ర. తప్పకుండా ఈ చిత్రం నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది. మాతృకతో పోలిస్తే ‘బ్రో’ సినిమాలో చాలా మార్పులు చేశారు. పవన్ కల్యాణ్ గారి ఇమేజ్‌కు తగ్గట్టుగా, సినిమాలో సోల్ మిస్ అవ్వకుండా మార్పులు చేశారు. చాలా కొత్త సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇదొక మంచి కుటుంబ కథా చిత్రం. అందరి హృదయాలకు హత్తుకునే సినిమా ఇది. నా కెరీర్ ఇప్పుడు సరైన దిశగా ప్రయాణిస్తున్నది. పాత్రలు, సినిమాల ఎంపిక విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ దిశగానే నా అడుగులు సాగుతున్నాయి’ అని తెలిపారు. సాయిధరమ్ తేజ్ సెట్లో చాలా సరదాగా ఉంటారని, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమయ్యామని తెలిపారు. ప్రస్తుతం హిందీలో కొన్ని సినిమాలు చేస్తున్నాన్నారు.