ఒక్క కన్నుగీటుతో.. కుర్రాళ్లను పరుగులు పెట్టించింది మలబారు బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్. సోషల్ మీడియాలో పొగులు సెగలు పుట్టిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగాపారెన్ టూర్ లో రచ్చ రచ్చ చేస్తోంది.
కన్నుగీటిన సీన్ తో.. కుర్రాళ్ళను పరుగులు పెట్టించింది మలబారు అందం ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క సీన్‌తో కుర్రకారు గుండెల్ని పిండేసింది మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier).అటుమలయాళంతో పాటు.. తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యింది. ఆమె వీడియో దేశ వ్యాప్తంగా హైలెట్ అయ్యింది.
కన్నుగీటు వీడియోతో ఇతర భాషల్లో కూడా ఫేమస్ అయిన ప్రియా ప్రకాశ్.. సినిమా అవకాశాలు కూడా సాధించింది. కాని ఎక్కడా క్లిక్ అవ్వలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫేమస్ అయ్యింది బ్యూటీ. అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తోంది.
తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ వెకేషన్ కు వెళ్ళింది.. ఫారెన్ టూర్ లో బిజీ బిజీ గా ఉంది. బ్యాంకాక్‌లో తన స్నేహితులతో కలిసి సరదాగా షికార్లు చేస్తుంది. అక్కడ వీధులన్నీ తిరుగుతూ తెగ సందడి చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో కనిపిస్తూ.. అటూ ఫ్యాన్స్‌తో పాటు ఇటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.
ఇక ఫారెన్ టూర్ కు సంబంధించిన ఫోటోలను తాజాగా తన సోషల్ మీడియా పేజ్ లో శేర్ చేసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక తెలుగలో నితిన్‌తో కలిసి తొలిసారి తెలుగు సినిమా చెక్ లో మెరిసింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత తేజా సజ్జా సరసన ఇష్క్ సినిమాలో నటించి మెప్పించింది బ్యూటీ. కాని ఈసినిమా కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం ప్రియా వారియర్ ఆశలన్నీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న బ్రో (Bro The Avatar) సినిమాపైన ఉన్నాయి. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటిస్తుండగా.. సాయి తేజ్ జోడీగా ప్రియా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం జులై 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలకు రెడీ అవుతుంది.