తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రియా భవానీ శంకర్‌(Priya Bhavani Shankar) చాలా పాపులర్‌. మొదట్లో టీవీ యాంకర్‌గా పని చేసి, అందులో మంచి పేరు సంపాదించుకుని, అటు పిమ్మట టీవీ సీరియల్స్‌(Tv Serials) నటించి, అట్నుంచి సినిమాల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా భవానీ శంకర్‌ ఇప్పుడు చాలా బిజీ. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. అయితే మొదటి సినిమా మేయాదమాన్‌(Mayadaman) తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా విజయవంతం కాలేదు.

దాంతో ఈమెపై ఐరన్‌ లెగ్‌(Iron Leg) ముద్ర వేయడానికి చిత్ర పరిశ్రమలోని ఓ వర్గం కాచుకుని కూర్చుంది. అయితే వీటిని పట్టించుకునే రకం కాదు ప్రియా భవానీ శంకర్‌. ప్రస్తుతం ప్రియా భవానీశంకర్‌ నటిస్తున్న చిత్రాల్లో కమలహాసన్‌ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ఇండియన్‌ 2(indian-2), ఎస్‌జే.సూర్య(SJ surya) సరసన నటిస్తున్న బొమ్మై చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాలు తనకు సక్సెస్‌లు రావడం లేదన్న కొరతను తీరుస్తాయని ఆమె అంటున్నారు. ఈ సందర్భంగా ఆమె సినీ పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై(sexual Harassment) కూడా స్పందించారు.

ఇలాంటివి కేవలం సినిమా రంగంలోనే ఉండవని, ఇతర రంగాలలో కూడా జరుగుతున్నాయని అన్నారు. అన్ని రంగాలలోనూ మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని, అలాంటి వారు ధైర్యంగా బయటకు చెప్పాలని ప్రియా భవానీ శంకర్‌ తెలిపారు. వారు చెప్పింది సమాజం వినాలని, వారిని తక్కువగా చూడటం మానుకోవాలని అన్నారు. తమపై లైంగిక దాడులు జరిగిన వెంటనే స్పందించాలి కానీ, ఇప్పుడు చెబుతున్నారేమిటి అనే సూటిపోటి మాటలను మానుకోవాలని పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధితులు గొంతు విప్పాలని చెప్పారు.

Updated On 15 Jun 2023 5:56 AM GMT
Ehatv

Ehatv

Next Story