తమిళ హీరో దళపతి విజయ్(Vijay Thalapathy) నటిస్తోన్న తాజా సినిమా లియో(LEO). ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజ్(Lokesh Kanaka Raj) దర్శకత్వం వహిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్(Seven Screen Studios) పతాకంపై ఎస్.ఎస్.లలిత్‌కుమార్(S.S Lalith Kummar) భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.

Vijay Thalapathy 68
తమిళ హీరో దళపతి విజయ్(Vijay Thalapathy) నటిస్తోన్న తాజా సినిమా లియో(LEO). ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజ్(Lokesh Kanaka Raj) దర్శకత్వం వహిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్(Seven Screen Studios) పతాకంపై ఎస్.ఎస్.లలిత్‌కుమార్(S.S Lalith Kummar) భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్(Anirudh) అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే సగానికిపైగా పూర్తయ్యింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేయాలన్నది మేకర్స్ సంకల్పం. ఈ సినిమా తర్వాత విజయ్ నటించనున్న తన 68వ చిత్రంపై అభిమానులు ఆసక్తి పెంచుకున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు మిస్కిన్, కమెడియన్ యోగిబాబులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఇందులో హీరోయిన్‌గా త్రిష(Trisha) నటిస్తున్నట్టు ఇంతకు ముందు వార్తలు వచ్చాయి, ఇప్పుడు మరో హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar). ఇంతకు ముందు యువ హీరోల సరసన నటించిన ప్రియా భవాని శంకర్ ఇటీవల పత్తుతుల సినిమాలో శింబు(Shimbu) సరసన టించింది. అలాగే రుద్రన్(Rudhran) సినిమాలో లారెన్స్‌కు(Raghava Lawrence) జంటగా నటించింది. ఇప్పుడు దళపతి విజయ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందట! అయితే ఈ సినిమాలో త్రిషతో పాటు భవాని శంకర్ కూడా నటిస్తున్నదా? లేకపోతే త్రిష ప్లేస్‌లో ఈమెను తీసుకున్నారా అన్నది మాత్రం ఇంకా తెలియదు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అప్పుడు హీరోయిన్ విషయంలో క్లారిటీ వస్తుంది.
2
