మలయాళంలో కల్ట్‌ క్లాసిక్‌ సినిమాగా పేరు తెచ్చుకున్న ప్రేమమ్‌(Premam) సినిమా చూసే ఉంటారు. మలయాళంలో చూడని వారు నాగచైతన్య(Nagachaithanya) హీరోగా వచ్చిన తెలుగు ప్రేమమ్‌ అయినా చూసి ఉంటారు. మలయాళ సినిమాకు దర్శకుడు అల్ఫోన్స్‌ పుత్రన్‌(Alphonse Puthran). అంతకు ముందు నేరమ్‌ సినిమా తీశాడు.

మలయాళంలో కల్ట్‌ క్లాసిక్‌ సినిమాగా పేరు తెచ్చుకున్న ప్రేమమ్‌(Premam) సినిమా చూసే ఉంటారు. మలయాళంలో చూడని వారు నాగచైతన్య(Nagachaithanya) హీరోగా వచ్చిన తెలుగు ప్రేమమ్‌ అయినా చూసి ఉంటారు. మలయాళ సినిమాకు దర్శకుడు అల్ఫోన్స్‌ పుత్రన్‌(Alphonse Puthren). అంతకు ముందు నేరమ్‌ సినిమా తీశాడు. అది కూడా హిట్టే! దాన్ని కూడా పలు భాషల్లో రీమేక్‌ చేశారు. ఇప్పుడీ దర్శకుడు సంచలన అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఇక తను సినిమాలు తీయనని చెప్పాడు. అందుకు కారణమేమిటో కూడా తెలిపాడు.

'నా సినిమా థియేటర్‌ కెరీర్‌ను(Theater Career) నిలిపివేస్తున్నాను. నేను ఆటిజమ్‌ స్పెక్ర్టమ్‌ డిజార్డర్‌తో(Autism Spectrum Disorder) బాధపడుతున్నాను. నిన్ననే నాకున్న జబ్బు గురించి తెలిసింది. ఇతరులకు భారం కాదలుచుకోలేదు. అయితే పాటలు, వీడియోలు, షార్ట్‌ ఫిలిమ్స్‌ మాత్రం ఓటీటీ కోసం తీస్తాను.సినిమాల నుంచి తప్పుకోవాలని నాకు లేదు కానీ మరో ఆప్షన్‌ లేదు' అని అల్ఫోన్స్‌ పుత్రిన్‌ తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించాడు. ఉన్నట్టుంటి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించినప్పుడు జీవితంలో ఓ పెద్ద ట్విస్ట్‌తో ఇంటర్వెల్‌ వచ్చినట్టు అనిపిస్తుందని అన్నాడు.

అయితే సోషల్‌ మీడియాలో ఈ ప్రకటన చేసిన కాసేపటికే అల్ఫోన్స్‌ పుత్రన్‌ తన పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ అంటే మెదడు ఎదుగుదలలో లోపం వల్ల వచ్చే మానసిక సమస్య. ప్రాణాంతకం కాదు కానీ ఈ సమస్య ఉండేవాళ్లు సమాజంలో నలుగురితో కలవడానికి, మాట్లాడ్డానికి ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి లక్షణాలు పిల్లల్లో, పెద్దల్లో వేర్వేరుగా ఉంటాయి. పెద్దలు చిన్నచిన్న వాసనలు, శబ్దాలు, పనులను కూడా గుర్తించి, చిరాకు తెచ్చుకుంటారు. ఈ జబ్బును నయం చేసే చికిత్స లేదు. మందులు వాడుతుండాలి. థెరపీ చేయించుకోవాలి. ఎక్స్‌ర్‌సైజులు చేయాలి. అల్ఫోన్స్‌ పుత్రన్‌ ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు.

Updated On 31 Oct 2023 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story