మలయాళ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి

మలయాళ బ్లాక్‌బస్టర్‌ సినిమాలు ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ కాకుండా బ్రహ్మయుగం కూడా హిట్ అయింది. మలయాళం సినిమా ఒకే నెలలోనే మూడు బ్లాక్ బస్టర్స్ ను సొంతం చేసుకోవడంతో మిగిలిన చిత్ర పరిశ్రమలు షాక్ లో ఉన్నాయి. మలయం పరిశ్రమ భారతీయ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ ఇండస్ట్రీ నుండి వస్తున్న కంటెంట్ ఉన్న సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. మమ్ముట్టి బ్రమయుగం తెలుగులో విడుదలైంది కానీ మలయాళంలో వచ్చినంత రెస్పాన్స్ రాలేదు. డిజాస్టర్ గా నిలిచింది భ్రమ యుగం.

ప్రేమలు మార్చి 8న విడుదలవుతుండగా, ఈ ప్రాజెక్ట్ వెనుక రాజమౌళి తనయుడు కార్తికేయ ఉన్నాడు. దిల్ రాజు కూడా మార్కెట్ లోకి ఈ సినిమాను వదలనున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు. మలయాళం, తమిళ మార్కెట్లలో సెన్సేషనల్ బిజినెస్ చేస్తున్న మంజుమ్మెల్ బాయ్స్ పరిస్థితి కూడా అంతే. మంజుమ్మెల్ బాయ్స్ తెలుగులో మార్చి 15న విడుదల కానుంది. ఈ సినిమాలు తెలుగులో వాటి అసలు మ్యాజిక్‌ను పునరావృతం చేస్తాయా లేదా బ్రహ్మయుగం బాటలో పయనిస్తాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Updated On 3 March 2024 10:03 AM GMT
Yagnik

Yagnik

Next Story