హనుమాన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రాబోతోంది. అంతేకాకుండా హనుమాన్ 3డి వెర్షన్ త్వరలో

సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా హనుమాన్. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన హనుమాన్ త్వరలో 3డీ లో కూడా సందడి చేయనుంది. ఈ ఏడాది చివర్లో 3D వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలోకి సినిమా రానుందని తెలుస్తోంది. జనవరి 12న విడుదలైన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ ను సాధించింది. ఆల్-టైమ్ సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 300 కోట్ల మార్కును చేరుకోవడంతో టాలీవుడ్ లో టాప్ 8 గ్రాసర్‌లలో తన స్థానాన్ని దక్కించుకుంది.

హనుమాన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి కూడా రాబోతోంది. అంతేకాకుండా హనుమాన్ 3డి వెర్షన్ త్వరలో విడుదల కానుందని వార్తలు వచ్చాయి. అమెరికాలో కూడా హనుమాన్ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. దీంతో హను-మాన్ టీమ్ 3డి వెర్షన్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. 3D వెర్షన్‌లో హనుమాన్ సినిమాలో కొన్ని కొత్త యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని కూడా చిత్ర బృందం ధృవీకరించింది. ఈ సినిమా క్లైమాక్స్‌లో హనుమంతుని ఎపిసోడ్ హైలైట్ అయింది. ఆ ఎపిసోడ్ ను 3డీ లో చూసి ఉండి ఉంటే మరింత కిక్ ఇచ్చేదని గతంలో పలువురు అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు మేకర్స్ హనుమంతుడికి సంబంధించిన సీన్స్, యాక్షన్ బ్లాక్‌లను కొత్తగా యాడ్ చేయబోతున్నారని హామీ ఇవ్వడంతో ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులను తిరిగి థియేటర్‌లకు లాగనుంది.ఇక ఈ సినిమా 3డీ వెర్షన్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.. ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చాక కూడా 3డీ వెర్షన్ ను చూడడానికి ఎంతమంది టికెట్లు కొనుక్కుని వెళతారో చూడాలి.

Updated On 8 Feb 2024 10:55 PM GMT
Yagnik

Yagnik

Next Story