డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ ఇప్పుడు సలార్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్‌(Adipurush) ఫలితం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. సలార్‌ సినిమా బ్రహ్మండమైన విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్‌(KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neil) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ ఇప్పుడు సలార్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్‌(Adipurush) ఫలితం వారికి తీవ్ర నిరాశను మిగిల్చింది. సలార్‌ సినిమా బ్రహ్మండమైన విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కేజీఎఫ్‌(KGF) ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neil) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కేజీఎఫ్‌ సిరీస్‌ సినిమాలు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హై ఇంటెన్సిటీ యాక్షన్‌, ఎమోషన్స్‌, ఎలివేషన్స్‌తో ప్రేక్షకులకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సరికొత్త అనుభూతిని కలిగించాడు. ఈ కారణంగానే సలార్‌ చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ అంచనాలను పెంచింది. ఈ సినిమాకు సంబంధించి సోషల్‌మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. సలార్‌ సినిమా యాక్షన్‌ ఘట్టాలు(Action Sequence) కేజీఎఫ్‌ను మించి ఉంటాయని, క్లైమాక్స్ లో వెయ్యి మందితో ప్రభాస్‌ తలపడతాడని అంటున్నారు. ఈ సినిమా యాక్షన్‌ ఘట్టాల చిత్రీకరణ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ప్రభాస్‌ అభిమాని ఒకరు సోషల్‌ మీడియాలో తన అనుభవాలను పంచుకున్నారు. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న విడుదల కానుంది

Updated On 22 Aug 2023 1:08 AM GMT
Ehatv

Ehatv

Next Story