ఇదిగో అదిగో అంటూ ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది సలార్‌(salaar) సినిమా టీజర్‌. ఏడెనిమిది నెలలుగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దీని కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి రెండు మూడు పోస్టర్లు(poster) తప్పితే ఎలాంటి గ్లింప్స్‌లు(Glimpse) విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అందుకు కారణం ఆదిపురుష్‌(adipurush) సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడం

ఇదిగో అదిగో అంటూ ప్రభాస్‌(Prabhas) ఫ్యాన్స్‌ను తెగ ఊరిస్తోంది సలార్‌(salaar) సినిమా టీజర్‌. ఏడెనిమిది నెలలుగా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ దీని కోసమే ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి రెండు మూడు పోస్టర్లు(poster) తప్పితే ఎలాంటి గ్లింప్స్‌లు(Glimpse) విడుదల కాలేదు. ప్రస్తుతం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు. అందుకు కారణం ఆదిపురుష్‌(adipurush) సినిమాకు నెగటివ్‌ టాక్‌ రావడం. బాహుబలి -2 తర్వాత(Bahubali-2) ప్రభాస్‌ నటించిన మూడు సినిమాలు పరాజయాన్ని చవి చూశాయి. సాహో(sahoo), రాధేశ్యామ్‌(Radheshyam), ఆదిపురుష్‌(adipurush) .. ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు ఫ్లాపులు రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా బాధపడుతున్నారు.

ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆదిపురుష్‌ సినిమాను ఆ రాముడు కూడా కాపాడలేకపోయాడు. ఇప్పుడు ప్రభాస్‌ అభిమానులు సలార్‌(Salaar) సినిమాపై గంపెడాశలు పెట్టుకున్నారు. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్‌ నీల్(prashanth neil) దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్‌ వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. లేటెస్ట్‌గా ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన డేట్ లాక్‌ అయిందని సమాచారం. సలార్‌ సినిమా టీజర్‌ వచ్చే నెల 7వ తేదీన రాబోతున్నదట. ఇదే విషయంపై సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. హోంబలే బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా, మలయాళ నటుడు పృథ్విరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు మరో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు.

Updated On 21 Jun 2023 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story