ఆర్ఆర్ఆర్‌(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) సినిమా రాలేదు. ఇంత గ్యాప్‌ తీసుకున్నందుకు ఫ్యాన్స్‌ కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న దేవర(Devara) సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇకపోతే సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు చాలా క్రేజ్‌ ఉంటుంది. కాంబో సెట్‌ అయినప్పటి నుంచి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఆర్ఆర్ఆర్‌(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) సినిమా రాలేదు. ఇంత గ్యాప్‌ తీసుకున్నందుకు ఫ్యాన్స్‌ కూడా కొంచెం అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న దేవర(Devara) సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇకపోతే సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్స్‌కు చాలా క్రేజ్‌ ఉంటుంది. కాంబో సెట్‌ అయినప్పటి నుంచి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) కాంబినేషన్‌ కూడా అలాంటిదే. ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి చాన్నాళ్లయ్యింది. ఇప్పటికీ ఆ సినిమా ఎప్పుడు సెట్స్‌ మీదకు వెళుతుందో తెలియని పరిస్థితి. ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత హృతిక్‌ రోషన్‌తో(Hrithik Roshan) కలిసి హిందీ వార్‌-2(War-2) సినిమాలో నటించబోతున్నారు ఎన్టీఆర్‌. ఇక దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌(Salaar) రెండో భాగంపై దృష్టిపెట్టబోతున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంటే ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కదన్న మాట! కొంచెం ఆలస్యం కావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దు నేపథ్యంలో సాగే అడ్వెంచరస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందట! దేశభక్తి ప్రధానంగా కథ సాగుతుందని చిత్ర యూనిట్‌ అంటోంది.

Updated On 11 July 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story