ట్రిపులార్(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా ఇచ్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దేవరను జాగ్రత్తగా మలుస్తున్నాడు కొరటాల శివ.

ట్రిపులార్(RRR) సినిమా తర్వాత ఎన్టీఆర్‌(NTR) నటిస్తున్న సినిమా దేవర(Devara). దీనికి కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా ఇచ్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దేవరను జాగ్రత్తగా మలుస్తున్నాడు కొరటాల శివ. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో, హై వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా దేవరను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌కు ఇది 30వ సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దేవర తర్వాత కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా గురించి దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తాజా అప్‌డేట్‌ను అందించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్‌(April) లేదా మే నెలలో ఎన్టీఆర్‌ చిత్రం సెట్స్‌మీదకు వెళ్తుందంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ చెప్పాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయన్నారు. దేవర పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.

Updated On 30 Sep 2023 12:05 AM
Ehatv

Ehatv

Next Story