టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులుతోసాటు సహ నటుల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా వార్2 చిత్రం తరఫున విషెస్ చెప్పారు. ఇక చిరంజీవి (Chiranjeevi) నుంచి మహేష్ బాబు,

టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన 40వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులుతోసాటు సహ నటుల నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు అందుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) కూడా వార్2 చిత్రం తరఫున విషెస్ చెప్పారు. ఇక చిరంజీవి (Chiranjeevi) నుంచి మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్, రాజీవ్ కనకాల వరకు చాలా మంది స్టార్స్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికే రిలీజైన దేవర (Devara) సినిమా నుంచి టెర్రిఫిక్ పోస్టర్‏ను విడుదల చేయడం మనం చూశాం.

ఇక ఇప్పుడు తన 31వ సినిమా అనౌన్స్‏మెంట్ పోస్టర్ షేర్ ఈ డేను బిగ్ డేగా మార్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టీమ్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పోస్టర్‏ను షేర్ చేస్తూ.. తారక్‏కు ఎ వెరీ హ్యాపీ బర్త్ డే అంటూ ఎన్టీఆర్ 31 చిత్రం పోస్టర్‏ను రిలీజ్ చేశారు.2024 మార్చిలో సెట్స్‏కు వెళ్తున్నట్టు చెప్పారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభంకానుంది.

ప్రశాంత్ నీల్ అంచనాలకు తగ్గట్టుగా ఇది ఒక కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుపుతూ రెడ్ షేడ్‏లో ఎన్టీఆర్ టైటిల్‏ను ఉంచడం ఇంట్రెస్టింగ్ ఉంది. అయితే ఫస్ట్‏లో చిత్ర టీమ్ మొదట్లో ఎన్టీఆర్ క్లోజ్ అప్ ఫేస్‏లో బ్లాక్ కలర్‏లో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‏పై కల్యాణ్ రామ్ (Kalyan Ram), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు రానున్నాయి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‏కు హ్యాపీ బర్త్ డే టూ యూ..

Updated On 20 May 2023 6:00 AM GMT
Ehatv

Ehatv

Next Story