చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తోంది హానుమాన్(Hanuman) మూవీ. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో సమానంగా సంక్రాంతి కానుకగారి బరిలోకి దిగిన ఈసినిమా.. అన్ని సినిమాతో పోటీ పడి.. పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన హనుమాన్.. తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ ను సాధించింది.
చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తోంది హానుమాన్(Hanuman) మూవీ. మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలతో సమానంగా సంక్రాంతి కానుకగారి బరిలోకి దిగిన ఈసినిమా.. అన్ని సినిమాతో పోటీ పడి.. పొంగల్ విన్నర్ గా నిలిచింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏమాత్రం తగ్గకుండా.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన హనుమాన్.. తెలుగుతో పాటు అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఇక నిరంజన్ రెడ్డి(Niranjan reddy) నిర్మించిన ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ(Prashanth varma) దర్శకత్వం వహించాడు.
అనుదీప్ దేవ్ - గౌరహరి సంగీతాన్ని సమకూర్చిన హనుమాన్ మూడు పెద్ద సినిమాలతో పోటీ పడి.. వాటిని తలదన్ని దూసుకుపోతోంది. రిలీజ్ అయిన తొలిరోజున తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. చాలా వేగంగా భారీ వసూళ్లను రాబడుతూ ఆశ్చర్య పరిచింది. రీసెంట్ గా 100 కోట్ల క్లబ్ లో చేరిన హనుమాన్ మూవీ.. చాలా తక్కువటైమ్ లోనే 200 కోట్ల క్లబ్ లోకి చేరింది. వంద నుంచి రెండు వందల కోట్లు సాధించడానికి ఈ సినిమాకి ఎక్కువ సమయం పట్టలేదు.
ఈసినిమా రిలీజ్ అయ్యి.. 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. సౌత్ లోనే కాదు నార్త్ లోను ఈ సినిమా తన జోరు చూపిస్తూ ఉండటం విశేషం. ఒక గిరిజన గూడానికి చెందిన యువకుడికి హనుమంతుడి అనుగ్రహం కలిగిన దివ్యమణి దొరుకుతుంది. ఆ దివ్యమణి వలన అతను మహాశక్తిమంతుడవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న విలన్, ఆ దివ్యమణిని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అతని కారణంగా హీరో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తాడు? ఇది హనుమాన్ కథ.
సూపర్ హిరో కథతో తెరకెక్కిన ఈమూవీకి సీక్వెల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈమూవీ క్లైమాక్స్ చూస్తేనే ఆ విషయం అర్ధం అయ్యింది. ఇక బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తేజ సజ్జా.... హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. ఈసినిమాతో పాన్ ఇండియా స్థార్ గా నిలిచాడు. ఈమూవీతో తేజకు వరుస అవకాశాలు వస్తున్నాయి.