హైదరాబాద్‌కు ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ ఓ ఐకాన్‌. సినీ అభిమానులందరూ ఈ మల్టిప్లెక్స్‌లో సినిమా చూసేందుకు ముచ్చటపడతారు.

హైదరాబాద్‌కు ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌ ఓ ఐకాన్‌. సినీ అభిమానులందరూ ఈ మల్టిప్లెక్స్‌లో సినిమా చూసేందుకు ముచ్చటపడతారు. ఈ థియేటర్‌ కోసమే ఎక్కడెక్కడ్నుంచో ప్రేక్షకులు వస్తుంటారు. అలాంటి థియేటర్లో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 సినిమా రాకపోవడం పెద్ద లోటే! ప్రసాద్‌ ఐమాక్స్‌లో పుష్ప 2 సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. పుష్ప సినిమాను తమ థియేటర్స్‌లో ప్రదర్శించడం లేదని ప్రసాద్‌ ఐమాక్స్‌(Prasads Multiplex ) ప్రకటించింది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ' మా విలువైన స్పాన్సర్లకు, పార్టనర్స్‌కు, దాదాపు 20 ఏళ్లకు పైగా సినిమా అభిమానులకు మేము అత్యుత్తమైన అనుభూతినికి కల్పించేలా థియేటర్స్‌ను రన్‌ చేస్తున్నాం. అయితే అనుకోని కారణాల వల్ల మేము పుష్ఫ 2 సినిమాను మీ అందరికీ ఇష్టమైన ప్ర‌సాద్స్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించలేక పోతున్నాము. ఈ విష‌యం మీకు ఇబ్బంది క‌లిగించి ఉంటే మేము దానికి చాలా చింతిస్తున్నాము. ఈ విష‌యంలో మా హృద‌య‌పూర్వక క్షమాపణలు తెలుపుకుంటున్నాము. మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మీరు మాతో ఉన్నందుకు ధ‌న్యవాదాలు. మీ మ‌ద్దతు.. విధేయ‌త మాతో ఎల్ల‌ప్పుడు ఉంటాయ‌ని కోరుకుంటున్నాము' అంటూ ప్ర‌సాద్స్ అధికారికంగా తెలిపింది. ప్రసాద్స్‌ ఐమాక్స్‌ యాజమాన్యానికి పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌కు డీల్‌ కుదరలేదని తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌సాద్ నుంచి ఎక్కువ షేర్ మైత్రి అడిగిన‌ట్లు స‌మాచారం. అలా అంత పెద్ద సినిమా అంత పెద్ద థియేటర్‌లో రాలేదు.

ehatv

ehatv

Next Story