సినిమాలో అవకాశాలు అంత ఈజీగా రావు. ముఖ్యంగా అమ్మాయిలకు...పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సినిమా పరిశ్రమలో హీరోయిన్లు అవమానాలను భరించాల్సి ఉంటుంది. కొందరు నిర్మాత దర్శకులు చాలా టార్చర్ పెడతారు. కమిట్మెంట్ ఇవ్వాలని పట్టుబడతారు. చాలా మంది హీరోయిన్లు ఆవేదనతో చెప్పిన మాట ఇది. స్టార్ హీరోయిన్లు కూడా తమను నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్ అడిగినట్లు చాలా సందర్భాలలో చెప్పారు.
సినిమాలో అవకాశాలు అంత ఈజీగా రావు. ముఖ్యంగా అమ్మాయిలకు...పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సినిమా పరిశ్రమలో హీరోయిన్లు అవమానాలను భరించాల్సి ఉంటుంది. కొందరు నిర్మాత దర్శకులు చాలా టార్చర్ పెడతారు. కమిట్మెంట్ ఇవ్వాలని పట్టుబడతారు. చాలా మంది హీరోయిన్లు ఆవేదనతో చెప్పిన మాట ఇది. స్టార్ హీరోయిన్లు కూడా తమను నిర్మాతలు, హీరోలు కమిట్‌మెంట్ అడిగినట్లు చాలా సందర్భాలలో చెప్పారు. టాలీవుడ్ నుంచి మొదలు పెడితే హాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్(casting Couch) వినిపిస్తూ ఉంది. ఇలాంటి పోకడలను నిరసిస్తూ మీ టూ ఉద్యమం ప్రారంభమయ్యింది. ఆర్టిస్టుల కంఠశోష తప్పితే ఇందులో న్యాయం దొరుతుందన్న నమ్మకం ఎవరికీ లేవు.
లేటెస్ట్‌గా ఒడియా సినీ పరిశ్రమకు చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై(Sanjay Nayak) ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియాలో వచ్చిన ప్రేమమ్ సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా(Prakrithi Mishra) నోరు విప్పారు. మీడియా ముందే నిర్మాతపై భగ్గుమన్నారు. తన సినిమాలో అవకాశం ఇస్తానంటూ నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని ప్రకృతి మిశ్రా అన్నారు. అవసరం తీరిన తర్వాత మళ్లీ ఆ నటి ముఖం కూడా చూడడని ప్రకృతి మిశ్రా అన్నారు.
సంజయ్ నాయక్ వంటి వారి వేధింపుల కారణంగానే ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటున్నానని, వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నానని ప్రకృతి అన్నారు. ఇప్పుడు తాను ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రియాలిటీ షోలే(Reality show) కారణమని అన్నారు. ప్రకృతి మిశ్రా కామెంట్లకు మరో నటి జాస్మిన్ రథ్(Jasmine Rath) మద్దతు తెలిపారు. తాను కూడా సంజయ్ నాయక్ బాధితురాలినే అని చెప్పారు. కానీ సంజయ్ నాయక్ మాత్రం వారి ఆరోపణలను కొట్టి పారేశారు. తనకు ఏ పాపం తెలియదన్నారు. హీరో బాబాసాన్‌తో ప్రకృతి మిశ్రా గొడవపడినప్పుడు తాను బాబు సాన్ వైపు నిలిచానని, ఆ కోపంతోనే ప్రకృతి మిశ్రా తనపై ఇలాంటి అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని సంజయ్ పేర్కొన్నారు.