ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) తిరుమల లడ్డూ(Tirumala laddu) ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేసినప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash raj) విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) తిరుమల లడ్డూ(Tirumala laddu) ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేసినప్పుడు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్(Prakash raj) విరుచుకుపడ్డారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది మీరే కాబట్టి నిజానిజాలను రుజువు చేసే బాధ్యత కూడా మీదేనని ప్రకాశ్‌రాజ్ అన్నారు. అది పవన్‌కు నచ్చలేదు. ప్రకాశ్‌రాజ్ చేసిన ట్వీట్ పవన్‌కు అర్థం కానున్నట్టుగా ఉంది. అందుకే హిందువుల జోలికి వస్తే ఊరుకోనని, సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే సహించని, ఇంకా చాలా చాలా అన్నారు పవన్. దాంతో ప్రకాశ్‌రాజ్ మళ్లీ ట్వీట్ చేయాల్సి వచ్చింది. అలా పవన్, ప్రకాశ్ మధ్య ట్వీట్ల వార్ మొదలయ్యింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాశ్‌రాజ్ సంధించే ప్రశ్నలకు పవన్ నుంచి సమాధానం లేకుండా పోయింది. ఇద్దరి మధ్య రాజకీయ వైరుధ్యాలు ఉంటే ఉండవచ్చు కానీ ఇద్దరూ కళాకారులు. కలిసి నటించాల్సి వారు. అయినప్పటికీ ఒకరినొకరు ఎదురుపడితే ఇద్దరికీ ఎంబరాజింగ్‌గా ఉంటుంది. త్వరలో పవన్, ప్రకాశ్‌రాజ్‌లకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రాబోతున్నది. ప్రకాశ్‌రాజ్-పవన్ కల్యాణ్ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందనుకుంటారు కానీ సినిమా విషయానికి వచ్చేసరికి అరమరికలు లేకుండా హాయిగా నటించేస్తారు. త్వరలోనే ఓజీ(OG) సినిమాతో వీరిద్దరు కలవబోతున్నారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీలో(Ramoji Film city) వేసిన సెట్ లో పవన్ కల్యాణ్‌తో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే పవన్ కల్యాణ్ సెట్స్‌లో రాబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్ కల్యాణ్, ప్రకాశ్‌రాజ్‌పై కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తారు. ఏదో ఊహించికుంటున్నాం కానీ, ప్రకాశ్‌రాజ్, పవన్‌లు ప్రొఫెషనల్ నటులు. వారు రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టరు. ఎందుకంటే వకీల్‌సాబ్ సినిమా అప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్‌రాజ్ తిట్టిపోశారు. వకీల్‌సాబ్ సినిమా చిత్రీకరణ సమయంలోనే పవన్‌పై విరుచుకుపడ్డారు ప్రకాశ్‌రాజ్. పవన్ తరచూ మాటలు మారుస్తారని, ఊసరవెల్లిలా వ్యవహరిస్తారని అన్నారు. ఇంత జరిగినా వకీల్‌సాబ్‌లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు ఓజీ సినిమాలోనూ అదే జరుగుతుంది.