టాలీవుడ్‌ స్వీటి అనండి, బ్యూటీ అనండి అది అనుష్క షెట్టికి(Anushka Shetty) మాత్రమే సూటవుతుంది. సుమారు అయిదేళ్ల తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి(Naveen Polishetty) కథనాయకుడిగా నటించిన మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టిలో(Miss shetty Mr Polishetty) అనుష్క మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

టాలీవుడ్‌ స్వీటి అనండి, బ్యూటీ అనండి అది అనుష్క షెట్టికి(Anushka Shetty) మాత్రమే సూటవుతుంది. సుమారు అయిదేళ్ల తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి(Naveen Polishetty) కథనాయకుడిగా నటించిన మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టిలో(Miss shetty Mr Polishetty) అనుష్క మళ్లీ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో నవీన్‌, హీరోయిన్‌ అనుష్కలు చేసిన ప్రమోషన్ల(Promotions) కారణంగా సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చింది. అనుష్క ఈసారి విన్నూత్నంగా సినిమాను ప్రమోట్‌ చేశారు. చెప్పుకోదగిన అంశమేమిటంటే అనుష్క కోసం ప్రభాస్‌(Prabhas) రంగంలోకి దిగడం. అనుష్క సినిమా కోసం ప్రభాస్‌ చేసిన ఓ పని సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మిస్‌ శెట్టి, మిస్టర్‌ పోలిశెట్టి సినిమాలో అనుష్క చెఫ్‌ పాత్రలో కనిపిస్తున్నారు. దీంతో లేటెస్ట్‌గా అనుష్క ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. తనకు ఇష్టమైన వంటకం మంగళూరు చికెన్‌ కర్రీ, నీర్‌ ఓశ ఎలా చేయాలో అభిమానులకు చెప్పారు. 'చెఫ్‌ పాత్రలో నటించడం నాకు ఇదే మొదటిసారి. ఇది నా బెస్ట్‌ సినిమాలా ఫీలవుతున్నాను. దీంతో సోషల్‌ మీడియా ద్వారా ఓ కొత్త ఛాలెంజ్‌ను ప్రారంభస్తున్నాను. ఇందులో ప్రభాస్‌ పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. భోజనాన్ని ప్రభాస్‌ అమితంగా ఇష్టపడతారు. ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారో ఆయన పోస్టు పెట్టాలి.' అని ప్రభాస్‌ను అనుష్క ట్యాగ్‌ చేశారు. అనుష్క విసిరిన ఈ ఛాలెంజ్‌ను ప్రభాస్‌ స్వీకరించాడు. ఆ వెంటనే తన ఫేవరెట్‌ రెసిపీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆయనకు రొయ్యల పులావ్‌ అంటే ఎంతో ఇష్టమట! ఆ వంటకాన్ని తయారు చేసే విధానాన్ని ప్రభాస్‌ షేర్‌ చేశారు.
ఆ తర్వాత ఈ ఛాలెంజ్‌ను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌కు(Ram charan) విసురుతున్నట్లు ప్రభాస్‌ చెప్పారు. ఇలా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఛాలెంజ్‌ ట్రెండింగ్‌లో ఉంది.

Updated On 7 Sep 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story