ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఆదిపురుష్‌(adipurush) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్‌ షో నుంచే మిశ్రమ స్పందన వచ్చింది.. కొందరు బాగుందంటున్నారు. కొందరు అసలు బాగోలేదని పెదవి విరుస్తున్నారు. రామాయణ(ramanaya) గాధను ఆధారంగా అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్‌ను తీశానని దర్శకుడు ఓం రౌత్‌ చెప్పుకొస్తున్నాడు.

ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఆదిపురుష్‌(adipurush) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్‌ షో నుంచే మిశ్రమ స్పందన వచ్చింది.. కొందరు బాగుందంటున్నారు. కొందరు అసలు బాగోలేదని పెదవి విరుస్తున్నారు. రామాయణ(ramanaya) గాధను ఆధారంగా అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్‌ను తీశానని దర్శకుడు ఓం రౌత్‌ చెప్పుకొస్తున్నాడు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌(prabhas), సీతగా కృతి సనన్‌(kriti sanon), రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌(saif Ali khan) నటించారు. ప్రస్తుతం భారత్‌లో ఏ హీరోకు లేనంత క్రేజ్‌ ప్రభాస్‌కు ఉందన్నది నిర్వివాదాంశం. రాముడిగా ప్రభాస్‌ నటించడంతో సినిమాకు బోల్డంత హైప్‌ వచ్చింది.

మరో నటుడు ఈ సినిమా చేసి ఉంటే ఇంత చర్చ ఉండేది కాదేమో.. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారు. ఇంతకీ ప్రభాస్‌ ఎక్కడా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందుకో కారణం ఉంది. టాలీవుడ్‌లో తన సినిమాను మొదటి రోజు హైదరాబాద్‌ థియేటర్లలో ప్రభాస్‌ చూస్తారు. ఇక్కడ అభిమానుల తాకిడి ఎక్కవ కావడంతో ముంబాయికు వెళ్లి సినిమా చూస్తున్నారు ప్రభాస్‌.

అయితే బాహుబలితో(Bahubali) పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు రావడంతో అక్కడ కూడా ప్రభాస్‌ థియేటర్లలో సినిమా చూసే పరిస్థితి లేదిప్పుడు. అందుకే విదేశాలకు వెళ్లి తన సినిమాను చూస్తున్నారు. అందుకే అమెరికాలో ఆదిపురుష్‌ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో ప్రభాస్‌ చూశారట. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్‌ కాలికి గాయం ఏర్పడింది. ఆ గాయం మళ్లీ తిరగదోడిందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కూడా ప్రభాస్‌ కాలి నొప్పితో ఇబ్బంది పడ్డారు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట ప్రభాస్‌. తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని సలార్‌ సినిమా సెట్‌లో అడుగుపెట్టనున్నారట. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్‌ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Updated On 17 Jun 2023 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story