బాహుబలి(Bahubali) సినిమా తర్వాత యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) క్రేజ్‌ దేశాలు దాటింది. ఓవర్‌నైట్‌ నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అభిమానులను నిరాశపర్చాయి. బాక్సాఫీస్‌ దగ్గర విజయం సాధించలేకపోయాయి. బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందలేదు.

బాహుబలి(Bahubali) సినిమా తర్వాత యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌(Prabhas) క్రేజ్‌ దేశాలు దాటింది. ఓవర్‌నైట్‌ నేషనల్‌ హీరో అయ్యారు ప్రభాస్‌. బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలు అభిమానులను నిరాశపర్చాయి. బాక్సాఫీస్‌ దగ్గర విజయం సాధించలేకపోయాయి. బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందలేదు. అయితే ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న సినిమాలన్నీ రెండేసి భాగాలుగా రూపొందుతున్నాయట. షూటింగ్‌ జరుపుకుంటున్న సలార్‌(Salaar), ప్రాజెక్ట్‌ కె(Project K) చిత్రాలు కూడా ఒక్కొక్కటి రెండు భాగాలుగా రూపొందుతాయని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ నడుస్తోంది.

ఈ సినిమాలే కాదు, మారుతి(Maruthi) దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా కూడా రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌(T.G.Vishwa Prasad) నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటోంది. హారర్‌ అంశాల మేళవింపుతో సినిమా ఆసక్తికరంగా ఉంటుందట. తాత మనవళ్ల కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారట. కథ రీత్యా ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది చిత్రయూనిట్‌. ప్రభాస్‌ రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ప్రభాస్‌ సరసన మాళవిక మోహనన్‌తోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. సినిమాకు రాజా డీలక్స్‌ అనే పేరును ఆలోచిస్తున్నారట.

Updated On 31 May 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story