ఆదిపురుష్‌(Adipurush) సినిమా ప్రభాస్‌ (Prabhas)అభిమానులను పూర్తిగా నిరాశపర్చింది. ఇప్పుడు త్వరలో రాబోతున్న సలార్‌(Salaar) పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక నుంచి అంతా శుభమే జరుగుతుందన్న గట్టి నమ్మకంతో ఉన్నారు. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన హీరో ప్రభాస్‌ బాహుబలి తర్వాత అలాంటి సినిమాలనే ఎంచుకుంటున్నారు. ఇందులో భాగమే ప్రాజెక్ట్ కే(Project-k) సినిమా కూడా! మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన లుక్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

టీజర్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం సినిమా అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభాస్‌ ఓ ఆసక్తికరమైన ట్వీట్‌(Tweet) చేశారు. 'ప్రాజెక్ట్‌ కె అంటే ఏమిటి..? ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్న ఈ మిస్టరీకి సమాధానాన్ని ఆవిష్కరించేందుకు ప్రాజెక్ట్‌ కె టీమ్‌లో చేరేందుకు రెడీగా ఉండండి. జులై 20న అమెరికాలోని సాన్ డియాగోలో(San Diego) అది ఏమిటో తెలుసుకోండి' అని ప్రభాస్‌ ట్వీట్‌ చేశారు. ప్రాజెక్ట్‌ K టీజర్‌ను అమెరికాలో గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ కె(Project-k) నుంచి దీపికా పదుకొనే లుక్‌తోపాటు ప్రభాస్‌ హ్యాండ్‌ లుక్‌ తెగ ఆకట్టుకున్నాయ. హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ప్రాజెక్ట్ కె ఉండబోతున్నట్టు అవి చెబుతున్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే , దిశా పటానీ, ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ సూపర్‌ అమితాబ్‌ బచ్చన్‌, లోక నాయకుడు కమలహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న సలార్‌ సినిమా రెండు పార్టులుగా రానుంది. మారుతి డైరెక్షన్‌లో హార్రర్ కామెడీ మూవీ కూడా ప్రభాస్‌ చేస్తున్నాడు.

Updated On 14 July 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story