డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఫలితమేమిటో చెప్పాల్సిన పనిలేదు.. రామాయణం(Ramayanam) ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌(Kriti sanon) సీతగా, సైఫ్‌ అలీఖాన్‌(Saif ali khan) రావణాసురుడిగా నటించారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచే విమర్శలు మొదలయ్యాయి. వివాదాలు చుట్టుముట్టాయి.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటించిన ఆదిపురుష్‌(Adipurush) సినిమా ఫలితమేమిటో చెప్పాల్సిన పనిలేదు.. రామాయణం(Ramayanam) ఆధారంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌(Kriti sanon) సీతగా, సైఫ్‌ అలీఖాన్‌(Saif ali khan) రావణాసురుడిగా నటించారు. సినిమా విడుదలైన మొదటి షో నుంచే విమర్శలు మొదలయ్యాయి. వివాదాలు చుట్టుముట్టాయి. అసలు ఈ సినిమాపై వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదంటే అతిశయోక్తి కాదు. బాహుబలి(Bahubali-2) రెండో భాగం తర్వా ప్రభాస్‌కు హిట్‌ లేకుండాపోయింద. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్‌ చాలా సెలెక్టివ్‌గా సినిమాను ఎంచుకున్నాడు కానీ బాక్సాఫీసు దగ్గర చతికిలపడుతున్నాయి.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సాహో(sahoo) ఆశించినంత విజయాన్ని సాధించలేకపోయింది. తర్వాత వచ్చని ప్రేమ కథా చిత్రం రాధేశ్యామ్‌(Radhe shyam) అదే బాటలో నడిచింది. ఇప్పుడు పౌరాణిక చిత్రం ఆదిపురుష్(Adipurush) దెబ్బ తినేసింది. చిత్రమేమిటంటే ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు దగ్గర వందల కోట్ల రూపాయలను వసూలు చేయడం. కాకపోతే హిట్‌ టాక్‌ను సాధించలేకపోయాయి. ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా నటించిన ప్రభాస్‌పై పెద్దగా విమర్శలు లేవు. దర్శకుడు ఓం రౌత్‌(Om Raut), మాటల రచయత మనోజ్‌ ముంతాషిర్‌ శుక్లాలనే(Manoj Muntashir Shukla) తిట్టిపోస్తున్నారు.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి.. ఓం రౌత్‌కు ధైర్యం చాలా ఎక్కువే! ఇన్ని తిట్లను, ఇన్నేసి విమర్శలను తట్టుకుంటున్నాడని కాదు.. ఆదిపురుష్‌ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ ప్రభాస్‌ దగ్గరకు సీక్వెల్‌(Sequel) ప్రతిపాదనతో వెళ్లాడు అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి చెప్పింది.. అసలు ఓం రౌత్‌ ఈ ప్రతిపాదనతో వెళ్లినప్పుడు ప్రభాస్‌ మొహం చూసి ఉండాలి.. వేరే వారైతే బండబూతులు తిట్టేవారేమో! ప్రభాస్‌ కాబట్టి ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి పంపేశారు.

ప్రస్తుతం సినీవర్గాలలో ఈ విషయం చర్చనీయాంశమయ్యింది. ఇప్పటికే బోల్డన్నీ విమర్శలు వస్తున్నాయి. ఇక సీక్వెల్ తీస్తే ఇంకేమైనా ఉందా అని ప్రభాస్‌ భయపడి ఉండొచ్చని నెజిటన్లు అంటున్నారు. తొలి మూడు రోజుల్లో 340 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఆదిపురుష్‌ సినిమా నాలుగో రోజు నుంచి ఉసూరుమనిపించింది. ఆ రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. పది రోజులకు 450 కోట్ల రూపాయలను మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే భారీ నష్టం తప్పదు.. ఎంతనేది కొన్ని రోజులుపోతేగానీ తెలియదు..

Updated On 26 Jun 2023 3:17 AM GMT
Ehatv

Ehatv

Next Story