యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులే కాదు, సినీ లవర్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్‌(Salaar). ఈ సినిమాపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే గంపెడాశలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెద్ద హిట్‌ లేకుండాపోయింది. తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర చతికిలపడ్డాయి. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టలేకపోయాయి. సాహో(sahoo), రాధేశ్యామ్‌(Radheshyam), ఆదిపురుష్‌లు(adipurush) అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులే కాదు, సినీ లవర్స్‌ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్‌(Salaar). ఈ సినిమాపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అయితే గంపెడాశలు పెట్టుకున్నారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెద్ద హిట్‌ లేకుండాపోయింది. తర్వాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర చతికిలపడ్డాయి. బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టలేకపోయాయి. సాహో(sahoo), రాధేశ్యామ్‌(Radheshyam), ఆదిపురుష్‌లు(adipurush) అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఈ నేపథ్యంలో సలార్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్​ యాక్షన్​ థ్రిల్లర్​ సినిమాను కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్​ నీల్(Prashanth neel)​ దర్శకత్వం వహిస్తున్నాడు. అంచనాలకు తగినట్టుగానే అంతే స్థాయిలో రికార్డులు కొల్లగొడుతోంది ప్రభాస్ సలార్. విడుదలకే ముందే ఓ రేంజ్‌లో దూసుకెళుతోంది ఇటీవల అమెరికాలో సలార్ టికెట్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్‌ చేస్తే కొద్ది క్షణాల్లోనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రభాస్ ఫ్యాన్స్ ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఓవర్సీస్‌లో సలార్ బ్రహ్మాండమైన కలెక్షన్లను సాధించడం ఖాయమనిపిస్తోంది. ఇప్పటికే 150 వేల డాలర్ల ప్రీ బిజినెస్‌ జరిగిందని అంటున్నారు. ఒక్క అమెరికాలోనే ఈ రేంజ్‌లో ప్రీ బుకింగ్స్‌ కావడంతో
పాత రికార్డులన్నీ చెదిరిపోయే అవకాశం ఉందని ఫ్యాన్స్‌ అంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్‌ సిరీస్​ ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ఇదే కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హోంబలే ఫిలింస్ పతాకంపై‌ విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్​, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే నెల 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated On 24 Aug 2023 7:19 AM GMT
Ehatv

Ehatv

Next Story