డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ సలార్‌(Salaar). ప్రభాస్‌ అభిమానులే కాదు, సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలను రూపొందించిన ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సలార్‌పై విపరీతమైన హైప్‌ వచ్చేసింది. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌(shruthi Hassan) నటిస్తున్నారు.

డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas) నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ సలార్‌(Salaar). ప్రభాస్‌ అభిమానులే కాదు, సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీలను రూపొందించిన ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి సలార్‌పై విపరీతమైన హైప్‌ వచ్చేసింది. ఇందులో ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌(shruthi Hassan) నటిస్తున్నారు. అలాగే పొగరు సినిమాలో నెగటివ్‌ రోల్‌ను పోషించిన శ్రియా రెడ్డి(Shriya Reddy) ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారరు. ఈ భారీ యాక్షన్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన విడుదల కాబోతున్నది. అయితే ఇప్పుడు సలార్‌ మూవీ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇంతకు ముందు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ఉగ్రం(Ugram) సినిమాకు సలార్‌ రీమేక్‌(Remake) అనే మాట వినిపిస్తోంది. ఈ మాటన్నది ఎవరో కాదు, ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన రవి బస్రూర్‌. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సలార్‌ విడుదల తేదీ ప్రకటించడంతో ఇలాంటి వదంతులు ఇంకా చాలా వస్తాయి. ఈ నేపథ్యంలో ఎన్నో నెలల క్రితం సంగీత దర్శకుడు రవి బస్రూర్ సలార్ సినిమా గురించి మాట్లాడిన వీడియో ఒకటి మళ్లీ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. డైరెక్టర్​ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రమ్‌కు సలార్​ రీమేక్​ అని ఆ వీడియోలో బస్రూర్‌ చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో క్లారిటీ లేదు. కానీ ఉగ్రం సినిమా చూసిన వారికి మూవీ లైన్​ను సరిచూస్తే కొంతమేరకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఇందులో నిజం ఉండదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కన్నడలో ఉగ్రం సినిమా భారీ విజయాన్ని సాధించింది. మళ్లీ ఇదే సినిమాను రీమేక్‌గా ప్రశాంత్‌ నీల్‌ ఎందుకు తీస్తాడని నెటిజన్లు అంటున్నారు. యూట్యూబ్‌లో ఉన్న ఉగ్రం సినిమాకు 50 మిలియన్లకు పైగానే వ్యూస్‌ వచ్చాయి. ఎవరో కావాలనే ప్రభాస్‌ సినిమాపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

Updated On 2 Oct 2023 1:25 AM GMT
Ehatv

Ehatv

Next Story